Mehra Bhanu Shree : బిగ్ బాస్ ఓ చెత్త షో మళ్లీ నోరుపారేసుకున్న భానుశ్రీ.. బన్నీ బ్లాక్ చేసినా ఈమెకు సిగ్గు రాలేదా..!

- Advertisement -

Mehra Bhanu Shree : అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో సంచలనం సృష్టిస్తుంది. ఈ షోపై జనాల్లో భిన్న అభిప్రాయాలున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఛీకొట్టినవాళ్లు ఉన్నట్లే.. ఆదరిస్తున్న వాళ్లు ఉన్నారు. ఈ షో వచ్చినప్పుడు మాత్రమే టీవీ చూసేటోళ్లు కూడా ఉండొచ్చు. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కాంట్రవర్సీ షో.. ఇప్పుడు ఏడవ సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఉల్టా పల్టా అనే కొత్త కాన్సెప్ట్‌తో ఈ సీజన్ -7 తీసుకొచ్చారు.

mehra bhanu shree
mehra bhanu shree

ఇక కంటెస్టెంట్లు తమదైన స్టైల్లో ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ షోపై ఘాటు వ్యాఖ్యలు చేసిందీ కాంట్రవర్సీ క్వీన్. ఆమె మరెవ్వరో కాదూ.. వరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భానుశ్రీ మెహ్రా. ఈ షోను ఆపేయాలంటూ గతంలో చాలా మంది సామాజిక కార్యకర్తలు కోర్టు మెట్లెక్కారు కూడా. ఎప్పుడు కాంట్రవర్సీలతో నడిచే ఈ షోపై భాను కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోని జనాలు ఎలా చూస్తున్నారో తనకు ఇప్పటికీ అర్థం కాకపోగా.. ఆశ్చర్యమేస్తుందని అన్నారు. ఎప్పటికప్పుడు కొత్త సీజన్లు రావడమేంటోనని సందేహం వ్యక్తం చేశారు. తన అభిప్రాయం ప్రకారం.. టీవీలో అత్యంత చెత్త షో అంటూ తిట్టి తిట్టనట్లు తిట్టారు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

తన ఇన్ స్టా గ్రామ్ ఫీడ్ అంతా బిగ్ బాస్ హైలెట్స్‌తో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిందీ ఈ భామ. అయితే ఆమె ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొత్త కాదు. గతంలో అల్లుఅర్జున్ తన ఖాతాను బ్లాక్ చేశాడంటూ హంగామా చేసిన సంగతి విదితమే. వరుడు సినిమాలో ఆమె ఫేస్ రివీల్ చేయకుండా.. థియేటర్లలో ఆమెను చూడాలంటూ..విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఆ ప్లాన్ బెడిసికొట్టింది. అయితే ఆ సినిమా ప్లాప్ మూటగట్టుకోవడంతో ఆమెకు ఛాన్సులు నిల్ అయ్యాయి. డింగ్ డాల్ బెల్, అలా..ఎలాలో చిన్న పాత్రలో కనిపించింది. గోవిందుడు అందరివాడేలే, రన్, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, 10th క్లాస్ డైరీస్, మిస్ ఇండియా సినిమాల్లో కూడా మెరిసింది. అయితే ఏ సినిమాను ఆమెకు ప్లస్ కాలేదు. హీరోయిన్ వేషాలు ఆమెకు రాకపోవడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here