Samyuktha Menon : ఏంటి షాక్ అవుతున్నారా ? కారణం ఏంటో తెలియదు కానీ కొన్నాళ్లుగా మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది డైరెక్టర్లు కొత్త కొత్త కథలను ఎంచుకుని తన ఇంటి వద్దకు తీసుకెళ్లినా చేయనంటూ రిజెక్ట్ చేస్తుందట. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఆమె కేవలం తెలుగు సినిమాలను మాత్రమే రిజెక్ట్ చేసేస్తుందట. దీంతో సంయుక్తా మీనన్ ఎందుకిలా సైలెంట్ అయిపోయింది అన్న వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ మారిపోయిన సంయుక్త మీనన్ ఓ బడా డైరెక్టర్ సాయంతోనే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటుంది అన్న వార్తలు ఇటీవల బాగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే.
ఆ డైరెక్టర్ ఆమెకుఎక్కువగా చనువుఇస్తున్నాడని.. తననే ఎక్కువగా నమ్ముతున్నాడు అని కామెంట్స్ కూడా చేశారు. అయితే బ్యాక్ టు బ్యాక్ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడం మానేసింది. దానికి కారణం ఓ బడా డైరెక్టర్ ఆమెకు హ్యాండ్ ఇచ్చి మరో బ్యూటీని లైన్లో పెట్టాడట అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. మరి కొందరైతే ఆ విషయం వాళ్లింట్లో తెలిసి గొడవలు అయ్యాయని.. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే తను టాలీవుడ్ కు దూరం అయిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అసలు నిజం తెలియాలి అంటే సంయుక్త మీనన్ స్వయంగా స్పందించాల్సిందే !