Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు అంత తేలికగా ఒక డైరెక్టర్ ని నమ్మడు, ఒకవేళ నమ్మితే మాత్రం చాలా గుడ్డిగా నమ్మేస్తాడు. ఉదాహరణకి తనకి పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చిన పూరి జగన్నాథ్ ని ఎంతో నమ్మి కథ కూడా వినకుండా ‘బిజినెస్ మెన్’ చిత్రం చేసాడు. ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. మహేష్ బాబు కి మాస్ ఆడియన్స్ లో మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం.
యూత్ ఆడియన్స్ విపరీతంగా ఇష్టపడిన చివరి మహేష్ బాబు చిత్రం ఇదే. అలా మహేష్ బాబు గుడ్డిగా నమ్మిన మరో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఆయన మహేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి క్లాసిక్ మల్టీస్టార్రర్ చిత్రాన్ని తెరకెక్కించి మహేష్ కి పెద్ద బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు. ఆ కృతజ్ఞతతోనే మహేష్ బాబు స్క్రిప్ట్ వినకుండా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకి డేట్స్ ఇచ్చాడు.
సినిమా 30 శాతం కి పైగా తీసిన తర్వాత మహేష్ బాబు కి అనుమానం వచ్చింది. కొన్ని సన్నివేశాలు చాలా రొటీన్ గా అనిపించి శ్రీకాంత్ అడ్డాల ని ఒక్కసారి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ని తీసుకొని రా అని అన్నాడు. అప్పుడు శ్రీకాంత్ అడ్డాల కేవలం ఫస్ట్ హాఫ్ కి సంబంధించి మాత్రమే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంకా రాయలేదు అని అన్నాడట. ఇది విన్న తర్వాత మహేష్ బాబు కి కోపం కట్టలు తెంచుకుంది అట.
నమ్మి స్క్రిప్ట్ కూడా వినకుండా డేట్స్ ఇస్తే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా అంటూ తన చేతిలో ఉన్న సీన్ పేపర్స్ ని కోపం తో చించి శ్రీకాంత్ అడ్డాల ముఖం మీద కొట్టి, షూటింగ్ నుండి వాక్అవుట్ అయ్యాడట. ఆ తర్వాత నిర్మాత పీవీపీ రంగం లోకి దిగి, మహేష్ కి నచ్చచెప్పి మళ్ళీ షూటింగ్ కి తీసుకొచ్చి సినిమాని పూర్తి చేసాడట. కానీ మహేష్ కి అప్పటికే ఈ చిత్రం ఆడాడు అనే విషయం అర్థం అయిపోయిందట. ఆయన అనుకున్నట్టుగానే ‘బ్రహ్మోత్సవం’ సినిమా అప్పట్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.