Venkatesh : వెంకటేష్ అలాంటి చెత్త పని చేస్తాడని అనుకోలేదు అంటూ స్టార్ హీరో సెన్సేషనల్ కామెంట్స్!

- Advertisement -

Venkatesh : మన టాలీవుడ్ లో కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలు ఎక్కువగా చేసిన హీరో విక్టరీ వెంకటేష్. ఎన్నో కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఏ హీరో కి అయినా ఫ్యామిలీ ఆడియన్స్ లో పేరు వచ్చిందంటే వెంకటేష్ తో పోల్చి చూస్తారు. ఆ స్థాయి బెంచ్ మార్క్స్ ని సెట్ చేసి పెట్టాడు వెంకటేష్.

Venkatesh
Venkatesh

ఒకప్పుడు శోభన్ బాబు కి ఎలాంటి క్రేజ్ ఉండేదో, నిన్నటి తరం హీరోలలో వెంకటేష్ కి అలాంటి క్రేజ్ ఉండేది. అలాంటి వెంకటేష్ నోటి నుండి బూతులు మాట్లాడడం కనీసం మనం ఊహించుకోలేము కూడా. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ కోసం ఆయన చేసిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో ఏ స్థాయి బూతులు ఉంటాయో మనమంతా చూసాము.

ఇంత బోల్డ్ క్యారక్టర్ ని వెంకటేష్ చూస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఈ సిరీస్ పై చాలా విమర్శలు మరియు వివాదాలు కూడా వచ్చాయి. లేటెస్ట్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సిరీస్ లో ఆయనకీ నటించే ఛాన్స్ వచ్చిందట, కానీ చివరి నిమిషం లో తనని తప్పించడం పై చాలా ఫీల్ అయ్యినట్టు బాబీ డియోల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇంకా ఆయన మాట్లాడుతూ రానా నాయుడు సిరీస్ తానూ చూశానని, మంచి కథ, అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయని, కానీ దానిని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా తియ్యలేదని, నాకు ఈ వెబ్ సిరీస్ నచ్చలేదంటూ కామెంట్స్ చేసాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here