Big Boss : ‘నోరు అదుపులో పెట్టుకో’ అంటూ అమర్ దీప్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక..స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేసిన నామినేషన్స్!

- Advertisement -

Big Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరకు నిజమైన స్నేహితులు లాగ కలిసి మెలిసి ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు అమర్ దీప్ మరియు ప్రియాంక. వీళ్లిద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే మంచి స్నేహితులు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బ్లాక్ బస్టర్ సీరియల్ ‘జానకి కలగనలేదు’ లో హీరో హీరోయిన్లు గా నటించారు. సుమారు గా రెండేళ్ల నుండి కలిసి ప్రయాణం చేసిన అనుభవం ఉంది.

Big Boss
Big Boss

హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా వీళ్లిద్దరి మధ్య ఆ ఎఫక్షన్ కొనసాగింది. ఇన్ని రోజులు వీళ్ళ మధ్యలో ఒక్కసారి కూడా గొడవలు జరగలేదు. కానీ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున అమర్ దీప్ విషయం లో ప్రియాంక కి చాలా సేపు క్లాస్ పీకుతాడు. భోలే బూతులు మాట్లాడినప్పుడు ఒక స్టాండ్ తీసుకొని అంతలా ఫైట్ చేసావు , మరి అమర్ దీప్ విషయం లో ఎందుకు సైలెంట్ ఉన్నావు అని అంటాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ఉంటే అందరితో సమానంగా న్యాయంగా ఉండండి, గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టుగా ప్రవర్తించకండి అంటూ ప్రియాంక తో అంటాడు. ఇది ఆమె మైండ్ లో బాగా పెట్టుకున్నట్టు ఉంది. అందుకే ఈరోజు జరిగిన నామినేషన్స్ లో అమర్ దీప్ ఆవేశం తో నోరు తూలినట్టు ఉన్నాడు. ప్రియాంక వెంటనే కల్పించుకొని ‘కోపం లో ఉన్నప్పుడు నోటికి ఏది వస్తే అది అనేస్తావా’ అని అంటుంది.

- Advertisement -

అప్పుడు ‘అవును మాట్లాడతా..అయినా అది బూతు కాదు’ అని అంటాడు. అప్పుడు ప్రియాంక ‘అది నీ దృష్టిలో బూతు కాదేమో’ అని అంటుంది. తర్వాత ఏమి జరిగింది అనేది నేడు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో చూడాలి. ఏది ఏమైనా ఇలా మంచి స్నేహితులుగా కొనసాగుతున్న అమర్ దీప్ మరియు ప్రియాంక మధ్య ఇలా హీట్ వాతావరణం లో వాదనలు జరగడం వాళ్ళ అంభిమానులకు కాస్త నిరుస్తాహం కలిగించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here