Big Boss : ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో బిగ్ బాస్ హౌస్ నుండి ఆ ప్రేమ జంట అవుట్..?

- Advertisement -

Big Boss : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లో నామినేషన్స్ పర్వం ఎంత ఆసక్తికరంగా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. సోమవారం వచ్చిందంటే చాలు, హౌస్ మొత్తం హీట్ వాతావరణం లో ఉడికిపోతుంది. గత వారం నామినేషన్స్ ఏ రేంజ్ హీట్ వాతావరణం లో కొనసాగిందో మనమంతా చూసాము, ఈ వారం కూడా అదే రేంజ్ నామినేషన్స్ జరిగాయి.

Big Boss
Big Boss

హౌస్ లో టాస్కులు అద్భుతంగా ఆడుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సందీప్ ఎలిమినేషన్ అందరికీ పెద్ద షాక్. మొదటి వారం నుండి 7 వారాల వరకు నామినేషన్స్ లో లేకపోవడం వల్లే అతను ఎలిమినేట్ అవ్వడానికి కారణం అని అంటున్నారు విశ్లేషకులు. అది కూడా తేజ వేసిన సిల్లీ రీజన్ కారణంగానే సందీప్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అందుకే ఈ వారం హౌస్ మేట్స్ అందరూ తేజ ని టార్గెట్ చేసారు.

ఇక ఈ వారం తేజ తో పాటుగా నామినేషన్స్ లోకి వచ్చిన ఇంటి సభ్యులు అమర్ దీప్, అంబటి అర్జున్, భోలే శవాలీ, శోభా శెట్టి, ప్రియాంక, రతికా , యావర్. వీరిలో ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం అమర్ దీప్, యావర్ మరియు భోలే టాప్ 3 స్థానాల్లో ఉన్నారు. డేంజర్ జోన్ లో శోభా శెట్టి మరియు టేస్టీ తేజా ఉన్నారు. అయితే ఈ సీజన్ మొత్తం ఉల్టా పల్టా అనే విషయం అందరికీ తెలిసిందే.

- Advertisement -

కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువ. అదే కనుక నిజమైతే తేజా మరియు శోభా శెట్టి ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శోభా శెట్టి అయితే ప్రస్తుతం అందరికంటే చివరి స్థానం లో కొనసాగుతుంది. సింగల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం శోభా శెట్టి నే హౌస్ నుండి వెళ్ళిపోతుంది అని అంటున్నారు, చూడాలి మరి ఏమి జరగబోతుందో.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here