Abhinav Gomatam : మహేష్ హీరోగా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పికా గణేష్. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తనకు సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే కమెడియన్ అభినవ్ గోమటంపై వచ్చిన ఆరోపణల కారణంగానే తాను మరింత పాపులర్ అయింది. అభినవ్ గోమటం తనతో అసభ్యకరంగా, తనను వేధించాడని అనేక ఇంటర్వ్యూలలో ఆమె ఆరోపించింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోలీసులను అభ్యర్థించింది.
కానీ కల్పిక చేసిన ఆరోపణలు అభినవ్ కంటే ఆమెకే నెగిటివిటీ తెచ్చిపెట్టాయి. సోషల్ మీడియాలో ఆమెపైనే బాగా ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత కల్పిక సైలెంట్ గా ఉండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో అభినవ్ గోమటం వివాదాన్ని అందరూ మరిచిపోయారు. అయితే ఈ వివాదంపై అభినవ్ గోమటం తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అసలు కల్పితతో ఎఫైర్ ఏంటని అడిగిన యాంకర్ కు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. కల్పిక తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని.. ఆమెతో తనకు ఎలాంటి ఎఫైర్ లేదని అభినవ్ స్పష్టం చేశాడు.
“తనకు అవార్డు వచ్చిందని.. నారీ శక్తి అవార్డు అని పెద్ద సందేశం పంపింది.. ఈ అవార్డు గురించి నేనెప్పుడూ వినలేదు.. కానీ మీకు దక్కినందుకు చాలా గొప్పగా ఉంది.. అభినందనలు అంటూ రిప్లై ఇచ్చాను. అప్పటి నుంచి మొదలైంది.. నువ్వు అంత మూర్ఖుడివా? అవార్డ్ గురించి కూడా వినలేదా? అంటూ ఆ చర్చ చాట్లో ఇదిగో అదిగో అంటూ ఎక్కడికో వెళ్లిపోతుంది.. అప్పుడది నాకు తెలీదు.. ఇది ఇక్కడి దాకా దారి తీస్తుందో అని.. నేను ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను అనుకున్నాను.
ఆమె నన్ను పురుషాహంకారి అంటూ మెసేజ్లు చేస్తోంది. నేను ఉన్నట్లుండి ఈ డిస్కషన్ ఎక్కడికి వెళ్తుందిరా అని తేరుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూశాను. ఆ పీరియడ్లో ఆమె ప్రతి ఒక్కరితోనూ గొడవే. అందరినీ ఇన్స్టాగ్రామ్లో తిట్టుకుంటోంది. చాట్ మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.. అలా పెట్టింది నాకు మంచిదే అయింది. అసలు ఏం జరిగిందో జనాలు చూశారు. ఇందులో అభినవ్ తప్పేంటి అంటూ ఆమెనే తిట్టారు. నువ్వు చేసింది కరెక్ట్.. మేం మీ వెంటే అని మెసేజ్లు పంపారు’ అని అభినవ్ చెప్పాడు.