SS Thaman : ప్రజెంట్ టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు థమన్. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రేంజ్ కు ఎదిగాడు. ఇంత గొప్ప పొజిషన్ కు వచ్చిన థమన్ తన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు.
అయితే ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ పాపులర్ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన థమన్ కుటుంబ సమస్యల కారణంగానే తన చదువును ఐదో తరగతిలోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. థమన్ వాళ్ల నాన్నకు డ్రమ్స్ ప్లే చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అట. ఆ ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన థమన్ తండ్రి 500 సినిమాల్లోని పాటలకు డ్రమ్స్ ప్లే చేశాడట. ఇక కొంత డబ్బు సంపాదించుకున్న తర్వాత థమన్ తండ్రి ఫ్యామిలీ సెటిల్ అవుతుంది అన్న సమయంలో ట్రైన్లో ప్రయాణిస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు.
అందుకే చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో థమన్ అప్పటినుంచి ఆర్థిక సమస్యలతో చదువు మానేసి ఇంటి బాధ్యతలను తనపై వేసుకున్నాడు. డ్రమ్స్ ప్లే చేయడానికి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ల వద్దకు వెళ్లి ఛాన్స్ ల కోసం ఇబ్బందులు పడ్డాడట. అయితే థమన్ లోని టాలెంట్ ని గుర్తించిన ఏఆర్.రెహమాన్, మణిశర్మ లాంటివారు.. థమన్‌కు అవకాశం ఇచ్చి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కారణమయ్యారు.