dalip tahil : ఇండస్ట్రీలోని హీరోయిన్లలో సీనియర్ అయినా చూడగానే ఆకట్టుకునే రూపం జయప్రదది. ఇక అలాంటి ఆవిడకు సినిమాల్లో ఎన్ని అవమానాలు జరిగి ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. బాలీవుడ్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి అక్కడివారికి చేరువయ్యారు సీనియర్ నటుడు దాలిప్ తాహిల్.
ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోన్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. గతంలో తన గురించి వచ్చిన వార్తలపై స్పందించారు. జయప్రద తనని చెంపదెబ్బ కొట్టారంటూ జరిగిన ప్రచారంపై ఆయన తొలిసారి మాట్లాడారు. ‘‘జయప్రద అంటే నాకెంతో గౌరవం. ఆమె అందమైన నటి. ఓ సినిమా సెట్లో ఆమె నాపై ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ వచ్చిన వార్తలు చూసి నేను ఆశ్చర్యపోయా. ఇంతకీ ఆ సంఘటన ఏ సినిమా సెట్లో చోటుచేసుకుందో చెబితే తెలుసుకుంటా.
ఎందుకంటే నేను ఇప్పటి వరకూ ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కెరీర్ ఆరంభం నుంచి నేను ప్రతినాయకుడి పాత్రల్లోనే ఎక్కువగా నటించా. అందువల్ల అత్యాచారం సన్నివేశాలు నాతో చిత్రీకరించేవారు. అలాంటి సీన్ ఏదైనా ఉంటే.. నాతోపాటు హీరోయిన్‌కి కూడా ముందే చెప్పమనేవాడిని. వాళ్లు ఓకే అంటేనే ఆ సీన్లో నటిస్తానని.. లేకపోతే చేయనని చెప్పేసేవాడిని. ఒకవేళ దర్శకుడు బలవంతం చేస్తే సెట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించేవాడిని’’ అని ఆయన చెప్పారు.