Shivaji : బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి హౌస్ లో తనకంటూ ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని చూసే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది శివాజీ మాత్రమే. అందరికీ చాలా గొప్పగా బోధనలు చేస్తూ ఉంటాడు. కేవలం తనకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే సపోర్టు చేస్తూ అవతలి వ్యక్తి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ‘జనాలు చూస్తున్నారు’ అనేది ఇతనికి వాడుక పదం అయిపోయింది. గ్రూప్ ఆడుతున్నారు, స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు అని అంటూ ఉంటాడు కానీ, వాస్తవానికి ఇతనే ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసి, వాళ్ళని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అమర్ దీప్ మొదటి 5 వారాలు సరిగా ఆడలేదు. దొంగాటలే ఎక్కువగా ఆడాడు, ఇది కోట్లాది మంది తెలుగు ప్రజలతో పాటుగా అమర్ దీప్ కూడా ఒప్పుకున్నాడు. కానీ శివాజీ అప్పటి నుండి అమర్ దీప్ ని తక్కువ చేస్తూ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు.

గత వారం వరకు అమర్ దీప్ ని ఎదో ఒక కారణం తో నామినేట్ చేయడాన్ని మనం గమనించొచ్చు. ఇక పోతే గత రెండు వారాల నుండి అమర్ దీప్ కచ్చితంగా బాగా ఆడుతున్నాడు. ప్రతీ టాస్కులోను తన బెస్ట్ నూటికి నూరు శాతం ఇస్తూనే ఉన్నాడు. నాగార్జున కూడా అందుకు మెచ్చుకొని అమర్ దీప్ కి కేక్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. ఇలా ఆడుతున్నప్పుడు ప్రోత్సహించడం అనేది కనీస లక్షణం. కానీ శివాజీ ఎంతసేపు అమర్ దీప్ ని క్రిందకి లాగడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. గత వారం తేజా తో మాట్లాడుతూ ఈ వారం హౌస్ మేట్స్ అందరూ బాగా ఆడారు ఒక్క అమర్ దీప్ తప్ప అంటూ అతని పై తనకి ఉన్న అక్కసు ని చూపిస్తాడు. ప్రతీ ఒక్కరు అమర్ దీప్ ఆట ఇంప్రూవ్ అయ్యింది అని మెచ్చుకుంటుంటే, ఇతను మాత్రం వెనుక చేరి ఇలా మాట్లాడడం ఏంటి?.

ఈ మాట అమర్ దీప్ ముందు చెప్పే ధైర్యం లేదు. వెనుకే మాట్లాడుతాడు. వీకెండ్ లో నాగార్జున ఇలాంటి వాటి పై ఎందుకు వీడియోస్ వేసి శివాజీ అసలు రంగు బయట పడేలా చెయ్యొడో ఎవరికీ అర్థం కాదు. ఇక పోతే నిన్న నామినేషన్స్ లో అమర్ దీప్ శివాజీ ని నామినేట్ చేస్తూ ‘అన్నా..మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ ఆరోజు మీరు ఇక్కడ చేరి నేను చనిపోయే ముందు కూడా నా పిల్లలకు చెప్తాను, నిన్ను మాత్రం నమ్మొద్దు అని అన్నారు, అది నాకు నచ్చలేదు, మనసుకు బాధ అనిపించింది’ అని అంటాడు.

దానికి శివాజీ నేనేదో సరదాగా అన్న మాటలను పట్టుకొచ్చి నామినేట్ చేస్తున్నావ్ అని అంటాడు. కానీ అమర్ దీప్ నిజంగానే బాధపడ్డాడు, తన స్నేహితులతో కూడా చెప్పుకొని బాధపడిన వీడియో అందరూ చూసారు. దీనికి శివాజీ చాలా వెటకారం గా సమాధానం ఇస్తాడు. అంతే కాదు నిన్న ఎపిసోడ్ చివర్లో రతికా మరియు యావర్ తో మాట్లాడుతూ ‘ఈ వారం కరెక్ట్ గా నామినేషన్స్ జరిగాయి, ప్రేక్షకులు నిజంగా మనుషులే అయితే సరైన తీర్పు రావాలి, లేకపోతే వచ్చే వారం నేనే ఎవరినో ఒకరిని కొట్టి బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతా’ అని అంటాడు. ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది ఆడియన్స్ ఆలోచించాలి. కనీసం ఈ వారం అయినా నాగార్జున గారు శివాజీ చేస్తున్న తప్పులను,మైంటైన్ చేస్తున్న గ్రూప్ మాఫియా ని నిలదీస్తాడో లేదో చూడాలి.
