Big Boss : ఈ బిగ్ బాస్ సీజన్ లో తొలిసారి నామినేషన్స్ లోకి వచ్చిన సందీప్..డేంజర్ జోన్ లో ఉన్నది ఆయనే!

- Advertisement -

Big Boss : బిగ్ బాస్ సీజన్ లో ప్రేక్షుకులు నామినేషన్స్ ప్రక్రియ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న నామినేషన్స్ ప్రక్రియ లో మొదటి భాగం ఎంత వాడావేడి వాతావరణం మధ్య జరిగిందో మనమంతా చూసాము. ఈరోజు ఎపిసోడ్ లో నామినేషన్స్ పర్వం రెండవ భాగం టెలికాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ లో సందీప్ కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు.

బిగ్ బాస్ చరిత్ర లో సందీప్ లాంటి లక్కీ పర్సన్ ఎవ్వరూ లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన నామినేషన్స్ లోకి రాలేదు. 50 రోజుల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా ఆయన నామినేషన్స్ లోకి రావడం ఒక హిస్టరీ అనే చెప్పొచ్చు. మొదటి వారం లోనే పవర్ అస్త్ర ని గెలుచుకొని 5 వారాలు ఇమ్యూనిటీ పొందిన ఏకైక కంటెస్టెంట్ గా రికార్డు నెలకొల్పాడు.

Sandeep
Sandeep

ఆ తర్వాత సీక్రెట్ రూమ్ నుండి వచ్చి గౌతమ్ సందీప్ ని సేవ్ చేస్తాడు. ఇక 7 వ వారం లో అయితే సందీప్ కి కేవలం ఒకే ఒక్క ఓట్ పడడం వల్ల నామినేషన్స్ లోకి రాలేదు. కానీ ఈ వారం మాత్రం ఆయన నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇంకో విషయం ఏమిటంటే ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ కంటే సందీప్ కి తక్కువ ఓట్లు నమోదు అయ్యాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

- Advertisement -

ఇప్పటి వరకు నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల సందీప్ కి అసలు ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు. అందుకే ఆయనకీ తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఒకవేళ ప్రియాంక, అమర్ దీప్ వంటి వారు నామినేషన్స్ లో లేకపోతే కచ్చితంగా సందీప్ కి అత్యధిక లాభం కలిగి ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. మరి ఈ వారం ఆయన ఆట తీరుని బట్టి ట్రెండ్ ఏమైనా మారుతుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here