Tiger Nageswara Rao మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’ ఇటీవలే అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి ‘లియో’ మరియు ‘భగవంత్ కేసరి’ చిత్రాల తర్వాత విడుదల అవ్వడం పెద్ద నెగటివ్ అయ్యింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి భగవంత్ కేసరి , అలాగే యూత్ ఆడియన్స్ కి ‘లియో’ చిత్రాలు మొదటి ఛాయస్ గా మారాయి.

దాంతో ‘టైగర్ నాగేశ్వర రావు’ కి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. దానికి తోడు ఈ సినిమా రన్ టైం మూడు గంటల పైన ఉండడం పెద్ద నెగటివ్ అయ్యింది. ఇది గమనించి రన్ టీమ్ ని 30 నిమిషాలకు కుదించారు. దీంతో ఇప్పుడు వసూళ్లు కూడా కాస్త పుంజుకున్నాయి.

ముఖ్యంగా శని మరియు ఆదివారం రోజు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు బయ్యర్స్ కి కాస్త ఊరటని కలిగించింది. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, మూడవ రోజు కూడా అదే రేంజ్ షేర్ వసూళ్లు వచ్చాయి. అలా మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి దాదాపుగా 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక నేడు దసరా కావడం తో కచ్చితంగా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండే 5 కోట్ల రూపాయిలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలా మొదటి వారం లో ఈ చిత్రం ఓవరాల్ గా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 38 కోట్ల రూపాయలకు జరిగింది. మరి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా ఈ సినిమా వీక్ డేస్ లో కూడా వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. మరి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.