Amardeep : అమర్ దీప్ భార్య తేజస్విని పై శివాజీ పీఆర్ టీం వేధింపులు..ప్రూఫ్స్ తో సహా బయటపెట్టిన తేజస్విని!

- Advertisement -

Amardeep : ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో అమాయక చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ అమర్ దీప్. హౌస్ లోకి వచ్చిన తొలినాళ్లలో కాస్త అగ్రెసివ్ గా ఉండేవాడు కానీ, అతని మాస్కు తొలగిన తర్వాత అతనిది చిన్న పిల్లాడి మెంటాలిటీ అని ఆడియన్స్ మొత్తానికి అర్థం అయ్యింది. అందుకే ఆయనకీ అత్యధిక ఓట్లు దక్కించుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకడిగా కొనసాగుతున్నాడు.

Amardeep
Amardeep

మొదటి నాలుగు వారాల్లో ఎలా ఆడినా, గత రెండు వారాల నుండి మాత్రం అమర్ దీప్ తన ఆటతీరుని బాగా మెరుగుపర్చుకున్నాడు. ప్రతీ వారం నాగార్జున తో తిట్లు తినే అమర్ దీప్, నిన్న మాత్రం అద్భుతంగా ఆడవు అంటూ ‘వెల్ డన్’ అని కేక్ మీద రాయించి అమర్ దీప్ కోసం పంపించాడు నాగార్జున. నాగార్జున నుండి ఆ ప్రశంసలు వచ్చే సరికి అమర్ దీప్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో వచ్చే నెగటివ్ కామెంట్స్ పై అమర్ దీప్ భార్య తేజస్విని రీసెంట్ గా స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘అమర్ దీప్ చాలా బాగా ఆడుతున్నాడు, కానీ అతను స్నేహితులుగా భావించే కొంతమంది వెన్నుపోటు పొడుస్తున్నారు, ఇది అమర్ దీప్ గమనించడం లేదు. ఇక నేనెందుకు అమర్ దీప్ ఆటపై ఇన్ని రోజులు స్పందించకుండా మౌనంగా ఉన్నానని కొంతమంది అడుగుతున్నారు. కానీ ఏమి మాట్లాడిన ఇలా పైడ్ పీఆర్ టీం తో బూతులు తిట్టిస్తే నేను ఎలా మాట్లాడగలను. నేను ఒక ఆర్టిస్టుని, నాకు ఎన్నో పనులు ఉంటాయి, నా పనులతో పాటుగా అమర్ దీప్ పనులను కూడా చూసుకుంటున్నాను. నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ మద్దతు దారుల నుండే వస్తున్నాయి ‘ అంటూ తేజస్విని చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here