Krithi Shetty : ‘ఉప్పెన సినిమాతో వెండితెర అరంగేట్రం చేసి కోట్లాది మంది కుర్రకారులకు నిద్ర పట్టకుండా చేసిన కృతి శెట్టి, చూస్తుండగానే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘ఉప్పెన’ తర్వాత ఈ హీరోయిన్ చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ మరియు ‘బంగార్రాజు’ చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆ తర్వాతే ఈ హాట్ బ్యూటీ కి బ్యాడ్ టైం మొదలైంది.
వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి కానీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని దక్కించుకుంది. అదే సమయంలో శ్రీలీల అనే కుర్ర హీరోయిన్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడం, ఆమె కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరి సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడం తో కృతి శెట్టి వంటి హీరోయిన్స్ కి క్రేజ్ తగ్గిపోయింది. శ్రీలీల డేట్స్ దొరక్కపోతే ఈ హీరోయిన్ ని ఒక ఛాయస్ గా మాత్రమే చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలం లో ఈమె ఒక హీరో తో ప్రేమాయణం నడుపుతుందని , త్వరలోనే ఆ హీరోని పెళ్లాడబోతుంది అంటూ సోషల్ మీడియా లో అనేక కథనాలు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదంటూ కృతి శెట్టి టీం కొట్టి పారేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక తమిళ స్టార్ హీరో ఇంటికి కోడలిగా అడుగుపెట్టబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తుంది. కానీ ఇది రియల్ లైఫ్ లో మాత్రం కాదులేండి.
రీల్ లైఫ్ లో. శర్వానంద్ హీరో గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి శర్వానంద్ కి తండ్రిగా నటించబోతున్నాడు. కాబట్టి కృతి శెట్టి శర్వానంద్ లవ్ కనుక , విజయ్ సేతుపతికి కోడలు అవుతుంది. ఇంతకు ముందు వీళ్లిద్దరు ఉప్పెన చిత్రం లో తండ్రి కూతుర్లుగా నటించారు, ఇప్పుడు మామా కోడలు గా మన ముందుకి రాబోతున్నారు.