Big Boss : మంచి యాక్షన్ సినిమాలో వచ్చే ట్విస్టుల కంటే ఎక్కువ గా ఈ సీజన్ బిగ్ బాస్ షో లో వస్తున్నాయి. ఆ ట్విస్టులకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటుగా, ఆడియన్స్ మైండ్ కూడా బ్లాక్ అవుతుంది. రెండు వారల క్రితం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 5 మంది కొత్త కంటెస్టెంట్స్ లో హౌస్ లోకి పంపిన సంగతి అందరికీ తెలిసిందే.
గత వారం ఎలిమినేట్ అయినా శుభ శ్రీ, రతికా మరియు దామిని లలో ఎవరో ఒకరు హౌస్ మేట్స్ వేసే ఓట్ల ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నారని నాగార్జున తెలిపాడు. వీరిలో ఎవరికైతే అతి తక్కువ ఓట్లు వచుంటాయో ఆ కంటెస్టెంట్ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అని మరో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. అలా కంటెస్టెంట్స్ వేసిన ఓట్ల ప్రకారం అందరికంటే తక్కువ ఓట్లు రతికా కి వచ్చింది.
కాబట్టి ఈ వారం ఆమెనే హౌస్ లోకి అడుగుపెట్టబోతుంది. ఆమె ఎంట్రీ సంగతి కాసేపు పక్కన పెడితే ఈ వారం శివాజీ బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే ఆయన చెయ్యికి గాయం అయ్యింది. అది ఇంకా పూర్తిస్థాయిలో తగ్గలేదు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆయన కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి ఇంటికి వెళ్తానని రిక్వెస్ట్ చేసాడు.
బిగ్ బాస్ డాక్టర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పాడు. కాబట్టి ఈ వీకెండ్ ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 90 శాతం ఉన్నాయి. నామినేషన్స్ ప్రక్రియ లో అందరికంటే అతి తక్కువ ఓట్లను పూజా మూర్తి సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈమె ఎలిమినేట్ అవ్వాలి. కానీ శివాజీ ఆరోగ్య సమస్య తో బయటకి వెళ్లబోతుండడం తో ఆమె దాదాపుగా సేవ్ అయ్యినట్టే అని అంటున్నారు. మరి వీటిల్లో ఏది నిజం అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.