Bigg Boss Telugu : బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో ప్రస్తుతం అందరి కంటే టాప్ మోస్ట్ ఓట్లతో ట్రెండ్ అవుతున్న కంటెస్టెంట్ శివాజీ. హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే శివాజీ ఆడే ఆట చాలా తక్కువగానే అనిపిస్తాది. కానీ ఇంటికి ప్రతీ వారం ఆయన పెద్ద మనిషి తరహాలో ఒక కెప్టెన్ గానే వ్యవహరిస్తున్నట్టు మనకి అనిపిస్తాది. అంతే కాదు ఆట లో కూడా ఈయన సలహాలు తీసుకున్న టీమ్స్ సక్సెస్ లు సాధించాయి.
ఇప్పటి వరకు ఈయన లీడ్ గా చేసిన గేమ్స్ మొత్తం దాదాపుగా సక్సెస్ అయ్యాయి. అయితే రెండు వారాల ఆడిన ఒక టాస్కులో శివాజీ భుజం కి బలంగా దెబ్బ తగిలింది. అంతకు ముందు అడపాదడపా గేమ్స్ ఆడుతూ వచ్చిన శివాజీ, దెబ్బ తగిలినప్పటి నుండి ఫిజికల్ గేమ్స్ లో ఆడడం పూర్తిగా మానేసాడు. మధ్యలో ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి కట్లు కట్టించుకొని వచ్చాడు.
వచ్చే వారం కి పూర్తిగా చెయ్యి నొప్పి తగ్గిపోతుందని అనుకున్నాడు కాయాన్ని, ఇంకా తగ్గలేదట. దానికి తోడు ఈ వారం గౌతమ్ శివాజీ ఆడడం లేదని, అతని స్థానం లో ఎవరైనా కుర్రాళ్ళు వస్తే బాగుంటుంది అంటూ నామినేట్ చేసాడు. ఇక నిన్న రాత్రి అమర్ దీప్ కూడా మీతో పోలిస్తే మిగిలిన కంటెస్టెంట్స్ ఎక్కువ ఈ వారం కష్టపడినట్టు అనిపించింది. కాబట్టి నేను మిమ్మల్ని కెప్టెన్సీ కంటెండర్ నుండి తప్పిస్తున్నాను అని చెప్పి శివాజీ ని తొలగిస్తాడు.
ఈ రెండు సంఘటనలు ఆయనకీ బాధని కలిగించింది. అందుకే కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి బిగ్ బాస్ ని నేను ఆడలేకపోతున్నాను ఈ నొప్పితో, ఈ హౌస్ లో ఉంటే కచ్చితంగా ఆడాలి, హౌస్ లో ఉన్న పిల్లలకు కూడా నేను వేస్ట్ అనిపిస్తున్నాను, దయచేసి నన్ను బయటకి పంపేయండి బిగ్ బాస్ అని అంటాడు. అప్పుడు బిగ్ బాస్ మేము డాక్టర్లతో ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాము అని శివాజీ తో చెప్తాడు. మరి ఆయన బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతాడా లేదా అనేది చూడాలి.