Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య గా రేణు దేశాయ్ కి సోషల్ మీడియా లో మంచి గుర్తింపు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికీ రేణు దేశాయ్ ని సోషల్ మీడియా లో వదిన అని పిలుస్తూ ఉంటారు. ‘బద్రి’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన రేణు దేశాయ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్ళాడి సినిమాలకు టాటా చెప్పేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘జానీ’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా తర్వాత ఆమె ఎక్కువగా తెరవెనుక డిపార్ట్మెంట్స్ లోనే పని చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలన్నిటికీ ఈమెనే కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించేది. పవన్ కళ్యాణ్ తో విడిపోయాక నిర్మాతగా, దర్శకురాలిగా పలు సినిమాలను తీసిన ఆమె, ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం తో మరోసారి నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. విడుదలకు ముందు ఈమె పలు ప్రముఖ మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ‘బాలు’ సినిమా షూటింగ్ సమయం లో జరిగిన ఒక సంఘటన ని గుర్తు చేసుకుంది రేణు దేశాయ్.
ఆమె మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి నేను కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశాను. డైరెక్టర్ కరుణాకరన్ నేహా ఒబెరాయ్ ఫోటో చూపించి, అక్కా ఈమెనే మన సినిమాలోని సెకండ్ హీరోయిన్, ఐశ్వర్య రాయ్ లాగా ఉంది కదూ అని అన్నాడు. అప్పుడు అంత సీన్ లేదులే, బాగుంది కానీ ఐశ్వర్య రేంజ్ కాదు అని చెప్పాను. కానీ ఇది ఇండస్ట్రీ లో వేరే విధంగా ప్రచారం అయ్యింది. నేను బాలు హీరోయిన్ ని విమర్శించాను అని , ఆమెపై అసంతృప్తి ని వ్యక్తపరిచాను అని ప్రచారం చేసారు’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.