Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా నిహారిక కొణిదెల కి ఇండస్ట్రీ లో మంచి పాపులారిటీ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి సరైన సక్సెస్ లేక సినిమాలకు దూరం అయ్యింది. ఆ తర్వాత ఆమె చైతన్య అనే వ్యక్తిని పెళ్లాడింది. కొంతకాలం కాపురం సజావుగా సాగించిన నిహారిక , కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు అవ్వడం వల్ల అతనితో విడిపోవాల్సి వచ్చింది.
వీళ్లిద్దరి పెళ్లిని నాగబాబు రాజస్థాన్ లో ఎంత ఘనంగా జరిపించాడో మనమంతా చూసాము. సోషల్ మీడియా లో ‘నిశ్చయ్’ అనే ట్యాగ్ తో సెర్చ్ చేస్తే ఎన్నో వందల ఫోటోలు మరియు వీడియోలు ఈ పెళ్ళికి సంబంధించినవి కనిపిస్తాయి. అలా చూడచక్కగా ఉండే ఈ జంట ఇలా విడిపోవడం అభిమానులకు బాధని కలిగించిన విషయం. ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న నిహారిక భవిష్యత్తులో రెండవ పెళ్లి చేసుకుంటుందో లేదో తెలియదు.
అయితే విడాకుల తర్వాత ఈమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ, నిర్మిస్తూ కెరీర్ ని లాక్కొస్తున్న నిహారిక, ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పింది. అందుకోసం ఎలాంటి పాత్రలో అయినా నటిస్తానని, అందాలు ఆరబొయ్యడానికి కూడా సిద్దమే అంటూ ఇంస్టాగ్రామ్ లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది.
రీసెంట్ గా ఆమె బ్లూ చీర మీద జాకెట్ లేకుండా దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో నిహారిక ఎంతో అందం గా కనిపించింది. కానీ అలా జాకెట్ లేకుండా కనిపించడం పై మెగా అభిమానులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మీ నాన్న మరియు బాబాయ్ ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఇలాంటివి చేస్తే వాళ్లకి చెడ్డ పేరు వస్తుంది అంటూ ఈ ఫోటోల క్రింద కామెంట్స్ చేస్తున్నారు.