Bigg Boss Telugu 7 ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మొదటి ఎపిసోడ్ నుండి నేటి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ సీజన్ ప్రస్తుతం 7 వారం లోకి అడుగుపెట్టింది. ఈ 7 వ వారం లో కెప్టెన్సీ టాస్కులో భాగంగా బిగ్ బాస్ జిలేబరం మరియు గులాబిపురం అని రెండు టీమ్స్ గా విభజించి టాస్కుని నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ టాస్కులో నిన్న జిలేబీపురం టీం గెలిచినా సంగతి అందరికీ తెలిసిందే. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ టాస్కు ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని పంచింది. ఇక ఈ టాస్కు నేడు కూడా కొనసాగుతుండగా, ఈ వారం కెప్టెన్ గా సందీప్ ఎంపిక అయ్యినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
పవర్ అస్త్ర టాస్కుల తర్వాత మొదలైన ఈ కెప్టెన్సీ టాస్కు లో విజేతగా నిలిచి ఇంటికి మొట్టమొదటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఆ తర్వాత రెండవ కెప్టెన్ గా ప్రిన్స్ యావర్ నిలవగా, ఇప్పుడు మూడవ కెప్టెన్ గా సందీప్ నిలిచాడు. అయితే ప్రతీ వారం ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వాల్సిందే కదా, ఇందులో సందీప్ ఎవరికీ సాధ్యం కానీ రికార్డుని ఏమి నెలకొల్పాడు అని మీ అందిరికీ సందేహం రావొచ్చు. ఆ మ్యాటర్ దగ్గరకే వస్తున్నాం.
ఇంటికి వచ్చిన మొదటి వారం లో పవర్ అస్త్ర ని గెలుచుకొని 5 వారాలు నామినేషన్స్ నుండి ఇమ్మ్యూనిటీ సంపాదించాడు. ఆ తర్వాత ఆరవ వారం లో నామినేట్ అయ్యాడు కానీ , గౌతమ్ సేఫ్ చేసాడు. 7 వ వారం కేవలం ఒక్క ఓటు పడడం వల్ల మళ్ళీ నామినేషన్స్ ని తప్పించుకున్నాడు. ఇప్పుడు 8 వ వారం కూడా కెప్టెన్ అవ్వడం వల్ల మరోసారి నామినేషన్ తప్పించుకున్నాడు. అలా వరుసగా 8 సార్లు నామినేషన్స్ ని తప్పించుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ గా సందీప్ సరికొత్త చరిత్ర ని సృష్టించాడు.