Bala Krishna : బాలయ్య తో నటించడానికి సిగ్గు లేదా అని చాలా మంది నన్ను తిట్టారు అంటూ శ్రీలీల షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Bala Krishna : ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి వరుస సూపర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న బాలయ్య కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని అనిల్ రావిపూడి తో కలిసి చేసిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రేపు ఈ చిత్రం గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అనుకున్న స్థాయిలో లేవు.

Bala Krishna
Bala Krishna

యూత్ మొత్తం ‘లియో’ మేనియా లో మునిగి తేలుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో బాలయ్య బాబు కి కూతురుగా శ్రీలీల నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ట్రైలర్ లో ఆర్మీ కి ట్రైనింగ్ అవుతున్న అమ్మాయిగా కనిపించింది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్న శ్రీలీల రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

బాలయ్య బాబు తో ‘భగవంత్ కేసరి’ చిత్రం లో నటిస్తున్నాను అని తన సన్నిహితులు మరియు స్నేహితులతో శ్రీలీల చెప్పినప్పుడు అందరూ షాక్ కి గురి అయ్యారట. అంత పెద్ద సీనియర్ హీరో సినిమాలో నువ్వు హీరోయిన్ గా చెయ్యడం ఏమిటి, సిగ్గు అనిపించట్లేదా అని అన్నారట. అప్పుడు శ్రీలీల నేను హీరోయిన్ పాత్ర చెయ్యడం లేదు, బాలయ్య బాబు గారికి కూతురు పాత్ర చేస్తున్నాను అని చెప్పిందట.

- Advertisement -

కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయం లో ఇలాంటి పాత్రలు చెయ్యడం అవసరమా అని మళ్ళీ తిట్టారట. అప్పుడు ఆమె కథ మొత్తం వివరించగా, నీ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన పాత్రలలో ఇది ది బెస్ట్ గా నిలుస్తుందని చెప్పారట. అలా ‘భగవంత్ కేసరి’ చిత్రం ఒప్పుకున్నప్పుడు ఇలాంటి కామెంట్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది అంటూ శ్రీలీల ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here