Leo Movie కోలీవుడ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్. ఆయనను తన ఫ్యాన్స్ ముద్దుగా దళపతి అనిపిలుచుకుంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన నైజం. సినిమా రంగంలో ఎంత స్టార్ హీరో అయినా సామాన్య జీవితం గడుపుతుంటాడు. అందుకే ఆయనకు వ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి విజయ్ తన తాజా చిత్రం లియోతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వనటుడు కమల్ హాసన్ తో విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన లోకేష్ కనగరాజ్ ఈ లియో చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు కొన్నేళ్ల తర్వాత విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఇంకా సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఈ చిత్రం నిర్మితమైంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
దసరా పండుగ కానుకగా పాన్ ఇండియా లెవల్లో ఏక కాలంలో తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన చిత్రానికి సంబంధించిన అన్ని అప్ డేట్స్ ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా విడులవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో వారికి ఓ బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. హీరో విజయ్ కి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు లియో మూవీ టిక్కెట్ రేట్లను భారీగా పెంచేశారు.
లియోను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఆయన అభిమానులు తెగ ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఒక్కో టిక్కెట్ ధర రూ. 5 వేలకు పెంచి అమ్ముతున్నారు. తమిళనాడులోని చెన్నై, మధురై, కోయంబత్తూరులో ఈ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఒక్కో టిక్కెట్ రూ. 5 వేలకు పెంచితే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.