Sreeleela : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ ఈ నెల దసరా కానుకగా 20 వ తారీఖున ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. బాలయ్య బాబు రాష్ట్రం ఏర్పడిన కొన్ని పరిణామాల వల్ల రెగ్యులర్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు కానీ శ్రీలీల మరియు అనిల్ రావిపూడి మాత్రం ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ , పాటలు మరియు ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా జరిపారు కాబట్టి,ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉండదేమో అని అభిమానులు ఫీల్ అయ్యారు. కానీ నేడు అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది మూవీ టీం.
ఈ ప్రెస్ మీట్ కి బాలయ్య బాబు తో పాటు,శ్రీలీల,డైరెక్టర్ అనిల్ రావిపూడి మరియు ఇతర నటీనటులు హాజరయ్యారు. ‘భగవంత్ కేసరి’ చిత్రం గురించి మూవీ యూనిట్ మొత్తం మాట్లాడిన మాటలు చూస్తే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరింత రెట్టింపు అవుతాయి. అయితే బాలయ్య బాబు ప్రసంగాలు చాలా లెంగ్త్ ఉంటాయి. మధ్య మధ్య లో ఆయన నోరు తూలడం వంటివి జరగడం, అది సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోలింగ్ కి గురవ్వడం వంటివి ఎన్నో సార్లు జరిగాయి.
ఈ ప్రెస్ మీట్ లో కూడా అదే జరిగింది. బాలయ్య బాబు శ్రీలీల గురించి మాట్లాడుతూ ‘శ్రీలీల చాలా అద్భుతమైన నటి..మంచి పోర్న్ ఆర్టిస్ట్’ అంటూ మాట్లాడాడు. వాస్తవానికి బాలయ్య చెప్పింది ‘బోర్న్ ఆర్టిస్టు’ అని, కానీ అది పోర్న్ లాగా వినిపించింది అందరికీ, ఇలాంటి పొరపాట్లు బాలయ్య కి చాలా సార్లు జరిగింది. ఇప్పుడు మరోసారి అది రిపీట్ అయ్యింది.