Tamannaah Bhatia : నోటికొచ్చినంత ఈజీ కాదు యాక్టింగ్.. మీడియాపై కోపంతో అంతెత్తు లేచిన తమన్నా.. ఇంతకీ ఏం జరిగింది..?

- Advertisement -

Tamannaah Bhatia : సెలబ్రిటీ లైఫ్ అంటే అంత వీజీ ఏం కాదు. ఓవైపు ఫిట్నెస్.. మరోవైపు ఫ్యాషన్.. ఇంకోవైపు వారు ప్రవర్తించే తీరు.. మాట్లాడే మాటలు.. చేసే పనులు.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు.. ఇలా వారి ప్రతి అడుగు కెమెరా నిఘాలో.. కోట్ల మంది ప్రేక్షకుల నిఘాలో ఉంటుంది. అందుకే వారు మీడియా ముందు ఎప్పుడూ ఆచితూచి ప్రవర్తిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మీడియా ప్రవర్తనతో విసిగిపోతారు. కొందరు దీనికి అలవాటు పడి.. దీటైన సమాధానాలు ఇస్తుంటారు. మరికొందరు చికాకు పడతారు. ఇంకొందరు కోపం తెచ్చేసుకుని మీడియాకు క్లాస్ తీసుకుంటారు.

Tamannaah Bhatia
Tamannaah Bhatia

అయితే మీడియాతో ప్రవర్తన వల్ల కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. మరికొందరేమో.. సపోర్ట్ను పొందారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటారా.. తాజాగా ఓ బ్యూటీ మీడియా ప్రశ్నకు చిర్రెత్తి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మరి ఆ బ్యూటీ ఎవరు..? ఆ సంగతేంటో చూద్దామా..?

మిల్కీ బ్యూటీ తమన్నా.. గురించి తెలియని వారుండరు. ఓవైపు టాలీవుడ్, కోలీవుడ్.. మరోవైపు బాలీవుడ్లో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది. ముఖ్యంగా ఇటీవల తన ఫోకస్ అంతా బీ టౌన్ పైనే పెట్టింది. ఇక అక్కడే ఓ బాయ్ఫ్రెండ్ను కూడా చూసుకుంది. అయితే ఇటీవల ఈ భామ తీస్తున్న సినిమాలు, సిరీస్లలో కాస్త బోల్డ్నెస్ ఎక్కువవుతోంది. అదే విధంగా ఈ బ్యూటీ ముంబయికి వెళ్లిన తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ కూడా కాస్త మారిపోయింది. బోల్డ్ ఔట్ఫిట్స్లో మిల్కీబ్యూటీ ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నాకు తన బోల్డ్ ఔట్ఫిట్స్పై విలేకరి నుంచి ఓ అనుకోని ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ బ్యూటీ అతడిపై విరుచుకుపడింది. తమన్నాకు కోపం వచ్చి మీడియాపై అంతెత్తున లేచింది. ఆ ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్న. ఇంతకీ అతడు ఏం అడిగాడంటే..?

- Advertisement -
tamanna

కెరీర్‌ స్టార్టింగ్లో పద్ధతిగానే ఉండేవారు. కానీ ఈ మధ్య మీలో బోల్డ్‌నెస్‌ ఎక్కువైంది. తగ్గిన అవకాశాలు పెంచుకోటానికేనా ఈ తిప్పలు? అని విలేకరి తమన్నాను అడిగాడు.ఈ ప్రశ్న విన్న తమన్నాకు పిచ్చి కోపం వచ్చింది. ‘తోచింది రాసినంత తేలిగ్గాదు యాక్టింగ్‌. అయినా నాకు అవకాశాలు తగ్గాయని ఎవరు చెప్పారు మీకు?. నేను రోజుకి 18గంటలు పనిచేస్తున్నా. ఇంత బిజీగా ఇంతకు ముందు కూడా లేను. నా పరిధి నాకు తెలుసు. ప్రవర్తన, వేషధారణ అనేవి పాత్ర డిమాండ్‌ని బట్టి ఉంటాయి. కేరక్టర్‌ నచ్చితేనే చేస్తాను. ఒప్పుకున్న తర్వాత పూర్తి న్యాయం చేయడం నటిగా నా ధర్మం. హాఫ్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలడగొద్దు ప్లీజ్‌..’ అంటూ సీరియస్‌గా సమాధానచ్చింది తమన్నా.

ప్రస్తుతం తమన్నా రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది. తమన్నా రియాక్షన్పై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరేమో ఈ బ్యూటీకి సపోర్ట్గా నిలుస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఓ మహిళ వ్యక్తిగత విషయం. వాళ్లకు నచ్చినట్లుగా ఉండే ఫ్రీడమ్ వాళ్లకు ఉంది అంటూ కొంతమంది తమన్నాకు సపోర్ట్గా నిలుస్తున్నారు. .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here