Surekha Vani : నన్ను అని రకాలుగా వాడుకొని వదిలేశారు.. సెన్సేషనల్ ట్వీట్ చేసిన సురేఖ వాణి

- Advertisement -


Surekha Vani : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ సంపాదించుకున్న నటి సురేఖ వాణి. ఎన్నో సినిమాల్లో అక్క, అమ్మ, వదిన పాత్రల్లో నటించి ఇంట్లోని వ్యక్తి మాదిరిగా కనిపించి ఆకట్టుకుంది. ఆమె నటనకు ఎంతో మంది అభిమానులన్నారు అనడంలో అతిశయోక్తి కాదు. అలాంటి సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కరోనా టైంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన సురేఖవాణి ప్రస్తుతం తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలతో పాపులారిటీ తెచ్చుకుంది. తన కుమార్తె తో చేసే పలు రకాల రీల్ వీడియోలు ఆమెను సోషల్ మీడియాలో సైతం స్టార్ ను చేశాయి. అప్పుడప్పుడు పార్టీలంటూ, ఇటు వెకేషన్ అంటూ వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాను నిత్యం ఆ వేదికపై యాక్టివ్ గా ఉంటూ సినిమాలపై ఫోకస్ తగ్గించింది.

Surekha Vani
Surekha Vani

ఇటీవల సురేఖవాణి డబ్ స్మాష్ వీడియోలే ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె వైయస్ షర్మిల వీడియోలను సైతం చేస్తూ వైరల్ గా మారింది. ఇప్పుడు తాజాగా మరొకసారి అలాంటి వీడియోని షేర్ చేసింది. ఇందులో నాకు ఎవరూ లేరు ఉండాలని కూడా నేను అనుకోవడం లేదు. మీలాగా లేని ప్రేమలు ఉన్నాయని నటించే లైఫ్ నాది కాదంటూ ఒక వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగానే ఆమె జీవితంలో కూడా సురేఖవాణిని ఎవరైనా ఇలా వాడుకొని వదిలేసారా.. అందుకే ఇలా ఫీలై డైలాగ్ చెప్తోందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సురేఖ వాణి భర్త సురేష్ తేజ 2019లో అనారోగ్యం కారణంగా మరణించాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here