Kajal : నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీ లీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ మేరకు ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ సినిమాకు సంబంధించి అనేక విషయాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన తోటి హీరోయిన్ శ్రీ లీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇప్పుడు వచ్చే జనరేషన్ హీరోయిన్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓ హీరోయిన్ కి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటి? అని యాంకర్ అడగగా దానికి కాజల్ బదులిస్తూ..” సినిమాలతో పాటూ పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. జీవితంలో సినిమాలతో పాటు ఇంకా చాలా చేయాలి. నేను కూడా సినిమాని బాగా ప్రేమిస్తాను. నా మొదటి లవ్ కూడా అదే. కానీ నా పర్సనల్ లైఫ్ లో సినిమాలతో పాటు ఇంకా చాలా పనులు చేస్తున్నా” అని తెలిపింది. శ్రీలీలతో పాటు ఈ జనరేషన్ హీరోయిన్స్ సినిమాల విషయంలో చాలా ఫోకస్ గా ఉన్నారు. అది నాకు బాగా నచ్చింది. వాళ్ళకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ ప్లానింగ్ ఉంది. వాటితోనే వాళ్లంతా ముందుకు వెళ్లడం నిజంగా అద్భుతం” అంటూ కాజల్ అగర్వాల్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
ఇక ‘భగవంత్ కేసరి’ విషయానికొస్తే.. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించగా, ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తండ్రి, కూతుర్ల మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్ తో ఈ సినిమా ఉండబోతోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.