Sreelela : శ్రీలీల ఎక్కడికి వెళ్తే అక్కడకి వస్తున్న మోక్షజ్ఞ.. విషయం చాలా దూరం వెళ్లేలా ఉందే!

- Advertisement -

Sreelela : ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్ర హీరోయిన్ శ్రీలీల కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు, అలాగే స్టార్ హీరోల దగ్గర నుండి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతీ ఒక్కరికి ఈమె ఇచ్చే డేట్స్ మాత్రమే కావాలి. అసలు టాలీవుడ్ శ్రీలీల ఒక్కటే హీరోయిన్ కాదు, ఎంతోమంది ఉన్నారు అనే విషయాన్నే మర్చిపోయారు దర్శక నిర్మాతలు.

Sreelela
Sreelela

అలా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి, హీరో రామ్ అన్నట్టుగానే శ్రీలీల ఒక్క రోజు సెలవు పెట్టింది అంటే టాలీవుడ్ స్ట్రైక్ అయ్యినట్టే అనుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈమె ప్రధాన పాత్రలో నటించిన బాలయ్య చిత్రం ‘భగవంత్ కేసరి’ ఈ నెల 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రొమోషన్స్ లో టీం మొత్తం చురుగ్గా పాల్గొంటుంది. అయితే ఈ టీం లో ఒక కొత్త వ్యక్తి జాయిన్ అయ్యాడు.

అతను మరెవరో కాదు, బాలయ్య బాబు కుమారుడు నందమూరి మోక్షజ్ఞ తేజ. ఇంకా ఈయన వెండితెర అరంగేట్రమే చెయ్యలేదు, ఆయనకీ ‘భగవంత్ కేసరి’ చిత్రానికి సంబంధం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ శ్రీలీల ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఎక్కడ ఉంటే, అక్కడికి మోక్షజ్ఞ వచ్చేస్తున్నాడు. ఈమె విషయం లో బాలయ్య బాబు కి మోక్షజ్ఞ వార్నింగ్ ఇచ్చినట్టు రీసెంట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సరదాగా చెప్తాడు బాలయ్య.

- Advertisement -

అంటే శ్రీలీల పై మోక్షజ్ఞ కన్ను ఆ రేంజ్ లో పడింది అన్నమాట. ఇదంతా చూస్తుంటే మోక్షజ్ఞ మొదటి సినిమా లో హీరోయిన్ గా శ్రీలీల ఫిక్స్ అయిపోయిందనే విషయం అర్థం అవుతుంది. చూడడానికి ఈ జంట ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వీళ్ళిద్దరిదీ అదిరిపోయేలా అనిపిస్తుంది. అయితే మోక్షజ్ఞ ఆమెని హీరోయిన్ గా పెట్టుకోవాలని చూస్తున్నాడా, లేదా ఏదైనా మేటర్ ఉందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here