Tamannaah Bhatia : సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇందులోకి ప్రవేశించిన వారు ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలన్న కసితో ఉంటారు. ఎన్ని వందల సినిమాల్లో నటించినా.. ఎంత స్టార్ డమ్ పొందినా ఇంకా ఏదో కొత్తదనం కావాలని ట్రై చేస్తుంటారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. హీరోయిన్ అయినా వాళ్ల కంటూ కొన్ని తీరని కోరికలు ఉంటాయి. ఎన్ని చేసినా ఫలానా పాత్ర చేయలేదని.. ఫలానా టైప్ సినిమా చేయాలని కోరకుంటారు. అంటే కాకుండా హీరోయిన్లు అయితే పలానా హీరోతో నటించాలని.. హీరో అయితే ఫలానా హీరోయిన్ తో చేయాలని ఇలా డిఫరెంట్ కోరికలుంటాయి. కానీ వాళ్ల టైం బ్యాడ్ కారణంగానో.. లేదా ఏదైనా కారణాల చేతనో వారి కోరికలు కొన్ని తీర్చుకోలేరు.
ప్రస్తుతం ఆ జాబితాలోకే వస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి హీరోలతో కలిసి నటించిన మెప్పించింది. అవార్డులు రివార్డులు లెక్కలేనన్ని అందుకుంది. అందరి చేత శభాష్ అనిపించుకుంది.. అదే సమయంలో బూతులు కూడా తిట్టించుకుంది.
అయితే తమన్నాకి అరుంధతి సినిమాలో అనుష్క లాగా లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలన్న కోరిక బలంగా ఉండేదట. కెరియర్ మొదటి నుంచి తను ఫీమేల్ లీడ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాలి.. అది కూడా అరుంధతి సినిమాలా ఉండాలంటూ ఫిక్స్ అయిందట. దురదృష్టమేంటో తెలియదు కానీ వచ్చినన్నీ గ్లామర్ పాత్రలే కావడం అలాంటి రోల్స్ తన వద్దకు రాకపోవడంతో తెగ ఫీలవుతుందట. ఇప్పటివరకు ఒక్క డైరెక్టర్ కూడా ఆమె వద్దకు అలాంటి కథలను తీసుకుని రాలేదట. ట్రెడిషనల్ సోషియో ఫాంటసీతో వస్తే తాను చేయడానికి రెడీ ఉన్నానంటూ సన్నిహితుల దగ్గర వాపోయిందట.