Big Boss : ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఎంత వాడావేడి వాతావరణం మధ్య కొనసాగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతీ టాస్కులోను ఈసారి గొడవలు ఎక్కువ జరిగాయి, అలాగే కంటెస్టెంట్స్ మధ్య ఎమోషనల్ బాండింగ్ బాగా పెరిగింది. ఈ వారం ఆడిన కెప్టెన్సీ టాస్కులో యావర్ మరియు తేజా ఒకరికి ఒకరు వ్యక్తిగతంగా బాగా కనెక్ట్ అయ్యారు. కానీ నిన్న మొన్నటి వరకు పల్లవి ప్రశాంత్ తో కలిసి ఉన్న యావర్,ఇప్పుడు దూరం గా ఉంటున్నాడు.
ఇక అమర్ దీప్ శివాజీ తో పడిన గొడవలు, అలాగే సందీప్ ఆడిన తొండి ఆటలు, గౌతమ్ మరియు సందీప్ మధ్య జరిగిన గొడవ, ఇవన్నీ చూసే ఆడియన్స్ కి బాగా కిక్ ని ఇచ్చింది. అయితే నిన్న నాగార్జున మాత్రం హౌస్ మేట్స్ ఈ వారం చేసిన తప్పుల చట్టాలను ఒక్కొక్కటిగా చదివి వాళ్ళను కడిగిపారేసాడు. ప్రతీ వారం లో లాగానే ఈ వారం కూడా సందీప్ మరియు అమర్ దీప్ ని నాగార్జున ఉతికి ఆరేసాడు.
ఫ్రిట్ నింజా టాస్కులో సందీప్ క్రింద కూర్చొని , తన బాస్కెట్ లో పడిన ఫ్రూప్ట్స్ ని కాకుండా క్రింద పది ఉన్న ఫ్రూప్ట్స్ ని తీసుకొని, వాటి రసం ని పిండడం నాగార్జున వీడియో వేసి చూపిస్తాడు. ఇది మోసపూరిత ఆట కాదా?, నువ్వు తప్పితే ఈ గేమ్ లో ఎవరూ అలా ఆడలేదు అంటూ నిలదీసాడు నాగార్జున. అప్పుడు సందీప్ అది ఆటలో భాగం సార్ , అందరూ మోసం చేస్తూనే ఆడాడు అని అంటాడు. అప్పుడు నాగార్జున ఎవరు ఆడారో చెప్పు అనగా, శుభశ్రీ క్రింద పడిన ఫ్రూప్ట్స్ ని తీసుకుందని ఎవరో చెప్పారు అని అంటాడు. నీ కళ్ళతో చూసింది కాకుండా, చెవులతో విన్నవి ఎలా చెప్తావు అని అంటాడు నాగార్జున.
ఇక ఆ తర్వాత అమరదీప్ ప్రశాంత్ ని వాడు మామూలుగానే దొంగలాగా కనిపిస్తాడు అని అన్న విషయాన్నీ నాగార్జున గుర్తు చేస్తాడు. అయ్యో నేను అనలేదు సార్ అని అంటాడు అమర్ దీప్. అప్పుడు నాగార్జున వీడియో వేసి చూపించగా, దొరికిపోయిన దొంగలాగా ముఖం పెట్టి అయ్యో నేను కావాలని అనలేదురా, ముఖానికి నువ్వు ఆ ఘాటు పెట్టుకున్నావు కాబట్టి అలా అన్నాను , క్షమించు అని ప్రశాంత్ ని అడుగుతాడు. వీళ్ళిద్దరిని నాగార్జున అడిగిన ప్రశ్నలకు నోటి నుండి సమాధానం రాక తడపడిన విషయాన్నీ మనం గమనించొచ్చు. దీంతో వీళ్లిద్దరు పరువు పోయింది, వచ్చే వారం నామినేషన్స్ లోకి వస్తే, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్క అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.