Actress : ఒక్క సినిమాతో 28 వేల కోట్లు సంపాదించిన హీరోయిన్ ఆమేనా..? ఇది మామూలు లక్ కాదు!

- Advertisement -

Actress : కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి పైకి ఎదిగి అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా చేసినంత వరకు చాలులే అని అనుకొని, పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ కి దూరం అవుతారు. మరికొంతమంది హీరోయిన్స్ అయితే కేవలం ఒకే ఒక్క సినిమాకి మాత్రమే పరిమితమై ఇండస్ట్రీ నుండి దూరంగా జరిగిపోతారు. అలాంటి హీరోయిన్ గురించి, ఆమెకి పట్టిన అదృష్టం గురించే ఈరోజు మన అందరం మాట్లాడుకోబోతున్నాము.

Actress

ఆమె పేరు గాయత్రీ జోషి, ఈమె సౌత్ ఆడియన్స్ కి అసలు ఎవరో కూడా తెలియదు. కేవలం బాలీవుడ్ ఆడియన్స్ కి మాత్రమే తెలుసు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘స్వదేశ్’ అనే హిందీ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఆడలేదు కానీ, ఆ తర్వాత టీవీ టెలికాస్ట్ మరియు ఓటీటీ కారణంగా నేటి తరం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన శ్రీమంతుడు మరియు మహర్షి సినిమాలు ఈ చిత్రాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కినవే. అయితే స్వదేశ్ తర్వాత గాయత్రీ ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది కానీ, ఆమె ఒప్పుకోలేదు. ఈ సినిమా తర్వాత వెంటనే ఆమె వికాస్ ఒబెరాయ్ అనే ప్రముఖ వ్యాపారవేత్త ని పెళ్లి చేసుకుంది. వికాస్ ఒబెరాయ్ కన్ స్ట్రక్షన్ ప్రమోటర్లు లో ఒకరు.

- Advertisement -

భారతదేశం లోనే అత్యంత ధనవంతులలో ఒకరు ఆయన. ఈయన ఆస్తులు దాదాపుగా 28 వేల కోట్ల రూపాయిలు ఉంటుందని సమాచారం. కేవలం ఒకే ఒక్క సినిమా తో ఏ హీరోయిన్ కలలో కూడా పొందలేని ఆస్తిని గాయత్రీ పొందింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ దంపుతులిద్దరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉండే గాయత్రీ కి సోషల్ మీడియా లో కూడా ఎలాంటి ఖాతాలు లేవు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here