Boyapati Srinu : సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్ ముందు వరుసలో ఉంటాడు. ఇతను అందించే పాటలు యూట్యూబ్ ని ఏ రేంజ్ లో ఊపేసాయో మన అందరికీ తెలిసిందే. ఇక ఈయన ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఆడియన్స్ కి పిచ్చి. యావరేజి కంటెంట్ ఉన్న సినిమాలను కూడా ఈయన తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ ని చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి మరియు బాలయ్య బాబు కి ఈయన చేసిన డ్యూటీ మామూలుది కాదు. వాళ్ళ కెరీర్ లోనే ది బెస్ట్ ఔట్పుట్ ని ఇచ్చాడు. ‘అఖండ ‘ చిత్రం అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం తమన్ అని అందరూ అంటూ ఉంటారు. అంత అద్భుతంగా టైటిల్ కార్డ్స్ దగ్గర నుండి ఎండింగ్ టైటిల్ కార్డ్స్ వరకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.

‘అఖండ’ చిత్రం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘స్కంద’ అనే చిత్రం రీసెంట్ గానే విడుదల అయ్యింది. రామ్ హీరో గా నటించిన ఈ సినిమా నేడు భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. బోయపాటి శ్రీను అర్థం పర్ధం లేని టేకింగ్ తో మితిమీరిన హింసతో తీసిన సన్నివేశాలు, అలాగే థమన్ సంగీతం ఈ సినిమాకి చాలా నెగటివ్ అయ్యింది అంటూ సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. దీనిపై బోయపాటి శ్రీను రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో స్పందించాడు. తమన్ మ్యూజిక్ పై కంప్లైంట్స్ వచ్చాయి.

నా సినిమా లో డీటీఎస్ చాలా క్లియర్ గా ఉంటుంది, కానీ థియేటర్స్ లో సౌండ్ సిస్టం పాత ఎక్విప్మెంట్ పెట్టడం వల్ల అలా అనిపించి ఉండొచ్చు, కానీ మీరు తమన్ సంగీతం మైనస్ అంటున్నారు కాబట్టి, అది నేను మరోసారి సినిమా చూసి చెప్తాను అని చెప్పుకొచ్చాడు. ‘అఖండ’ చిత్రం మరో లెవెల్ కి వెళ్ళడానికి కారణం తమన్, కానీ ఈ సినిమాకి మైనస్ తమన్ అని అంటున్నారు చాలా మంది అని యాంకర్ మరోసారి అనగా ‘అఖండ చిత్రాన్ని రీ రికార్డింగ్ లేకుండా చూసిన కూడా మీరు గర్వం గా ఫీల్ అవుతారు. ఆ చిత్రం లో ఉన్న దమ్ము అలాంటిది, ఇందులో తమన్ గొప్పతనం ఏమి లేదు’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.