Lavanya Tripathi : మరికొద్ది రోజుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ – లావణ్య పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి వచ్చే నెల నవంబర్ లో జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్న ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా శ్రీజ -నీహారిక విడాకుల తర్వాత మెగా ఫ్యామిలీ రెపుటేషన్ పూర్తిగా దెబ్బతింది. పచ్చిగా చెప్పాలంటే వారిద్దరు మెగా ఫ్యామిలీ పరువు తీసేశారు. దీంతో వారికి సంబంధించిన ప్రతి వార్తను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే వెంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినట్లు.. శ్రీజ -నీహారిక విడాకుల మేటర్ వరుణ్ పెళ్ళికి నానా అడ్డంకులను సృష్టిస్తోంది.
తాజాగా వరుణ్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వరుణ్ – లావణ్య త్రిపాఠి పెళ్లికి మరి కొన్ని రోజులే టైం ఉంది. కానీ లాస్ట్ మినిట్ లో లావణ్య తల్లి వరుణ్ ఫ్యామిలీకి షాక్ ఇచ్చిందట. ఇది విన్న నాగబాబు ఫ్యామిలీ షాక్ అయ్యారట. ఈ పెళ్ళికి ఎట్టిపరిస్థితుల్లోనూ నిహారిక – శ్రీజ రాకూడదు అంటూ ఒక కండిషన్ పెట్టిందట. ఇప్పటికే సోషల్ మీడియాలో పెళ్లికి ముందే లావణ్య విడాకులు తీసుకుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక వాళ్లిద్దరు గాని పెళ్లికి వస్తే మరింత రేంజ్ లో లావణ్య ని ట్రోల్ చేస్తారని ఆమె తల్లి తెగ బాధ పడిపోతుందట. దీంతో వాళ్లిద్దరూ పెళ్లి రావద్దంటే కండీషన్ పెట్టిందట. దీంతో మెగా ఫ్యామిలీ అయోమయ స్థితిలో పడిపోయిందటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మెగా ఫాన్స్ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఓ తల్లికి తన బిడ్డ గురించి ఆ మాత్రం దిగులు ఉంటుందటుంటే.. మరికొందరేమో.. అది ఎంగేజ్ మెంట్ కు ముందే ఆలోచించుకోవాలని కామెంట్ చేస్తున్నారు.