నటీనటులు : కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, హైపర్ ఆది, వెన్నెల కిషోర్, అభిమన్యు సింగ్, అజయ్ తదితరులు
నిర్మాత : ఏ ఏం రత్నం
బ్యానర్ : మెగా సూర్య ప్రొడక్షన్స్
దర్శకుడు : రత్నం కృష్ణ
సంగీతం : అమ్రిష్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సె సాధించిన వారిలో ఒకడు కిరణ్ అబ్బవరం. ‘రాజావారు..రాణి వారు’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత ‘SR కల్యాణ మండపం’ సినిమాతో తొలి సక్సెస్ ని అందుకొని ఈ కుర్రాడు ఎవరో అదరగొడుతున్నాడు అని అందరి చేత అనిపించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత వరుసగా ఆయన సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ సక్సెస్ రేట్ తక్కువ. అయిన కూడా కిరణ్ అబ్బవరం మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు కాబట్టి, టాప్ నిర్మాతలు సైతం అతనితో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘రూల్స్ రంజన్’ అనే చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బ్లాక్ బస్టర్ ట్రైలర్ మరియు అద్భుతమైన పాటలతో సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగాయి. మరి ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
రంజన్ అనే కుర్రాడు ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తూ ఉంటాడు. ఇతను తన జీవితం లో పెట్టుకున్న రూల్స్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ ఉంటాడు. అందువల్ల అందరూ ఇతనిని రూల్స్ రంజన్ అని ఆఫీస్ లో పిలుస్తూ ఉంటారు. అలా సాగిపోతున్న ఇతని జీవితం లోకి హీరోయిన్ నేహా శెట్టి వస్తుంది. రంజన్ పని చేస్తున్న ఆఫీస్ లోనే ఆమె చేరుతుంది. ఈమెతో రంజన్ కి స్నేహం ఏర్పడడం, ఆ తర్వాత అది ప్రేమగా మారడం జరుగుతుంది. కానీ రంజన్ పెట్టుకున్న రూల్స్ వల్ల ఇద్దరి మధ్య గొడవలు రావడం మొదలు అవుతాయి . ఈ గొడవలను రంజాన్ ఎలా అధిగమించాడు?, ప్రేమ కోసం తనకి తానూ పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేసి తన ప్రేమని నిలుపుకున్నాడా లేదా అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
కిరణ్ అబ్బవరం తన ప్రతీ సినిమాలో కొత్తదనం కనిపించేలా చూసుకునేందుకు పరితపిస్తూ ఉంటాడు. ఆయన చేసే సినిమాలు కూడా అన్నీ అలాగే ఉంటాయి. అందుకే హిట్/ ఫ్లాప్ తో సంబంధం లేకుండా కిరణ్ అబ్బవరం కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో కూడా కిరణ్ ముందు సినిమాలతో పోలిస్తే ఎంతో చక్కగా నటించాడు. అతని కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఇక డైరెక్టర్ రత్నం కృష్ణ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో ఆయన కథ కంటే ఎక్కువ గా కామెడీ సన్నివేశాలను తియ్యడం మీదనే ద్రుష్టి పెట్టాడు. కొన్ని సన్నివేశాలు పేలాయి కూడా. హైపర్ ఆది, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ని బాగా వాడుకొని సేఫ్ ప్లే చేసే ప్రయత్నం చేసాడు. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్ గా సాగిపోతాది.
ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఎక్కువగా ఎమోషన్స్ కంటే కామెడీ మీదనే ద్రుష్టి సారించాడు డైరెక్టర్ రత్నం కృష్ణ. కానీ స్టోరీ రొటీన్ అవ్వడం వల్ల ప్రేక్షకులకు కాస్త బోర్ కొడుతాది. కథలో ట్విస్టులు , తర్వాత ఏమి జరగబోతుంది అనేది చాలా తేలికగా ఊహించే విధంగా ఉండడం తో ప్రేక్షకులు సినిమా ప్లాట్ కి దిస్ కనెక్ట్ అవుతారు. ఇక యూట్యూబ్ ని షేక్ చేసిన ‘సమ్మోహనుడా’ సాంగ్ ఆన్ స్క్రీన్ మీద అదిరిపోయింది. నేహా శెట్టి తన అందాలతో ప్రేక్షకులను నోరెళ్ళబెట్టి చూసేలా చేసింది ఈ సినిమాలో. నటన పరంగా కూడా తన పాత్రకి ఎంత న్యాయం చెయ్యాలో అంత న్యాయం చేసింది. అమ్రిష్ అందించిన మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించాడు.
చివరి మాట :
ఓవరాల్ గా ఈ వీకెండ్ టైం పాస్ అయ్యే విధంగా ఉంటుంది ఈ రూల్స్ రంజన్ చిత్రం. ఒకసారి అయితే కచ్చితంగా చూడొడ్చు.
రేటింగ్ : 2.5/5