Kalki : మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది అభిమానులకు కొంచెం తీపి, కొంచెం కారం అనుభవం ని కలిగించాడు. ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో గ్రాండ్ హిట్ ని అందుకొని, సుమారుగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టిన మెగాస్టార్, సెకండ్ హాఫ్ లో ‘భోళా శంకర్’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని తీసి అభిమానులను తల దించుకునేలా చేసాడు.
ఈ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ కి మొదటి రోజు వచ్చిన వసూళ్లను క్లోసింగ్ లో కూడా రాబట్టలేకపోయింది. అంత పెద్ద ఫ్లాప్ అన్నమాట, అందుకే ఇక నుండి అభిమానులకు అలాంటి అనుభూతి కలగకూడదని బలమైన నిర్ణయం తీసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక నుండి రీమేక్ సినిమాల జోలికి వెళ్ళడట. కొత్త సబ్జక్ట్స్ ని ఎంచుకొని, టాప్ డైరెక్టర్స్ తోనే వరుసగా సినిమాలు చేస్తాడట.
అందులో భాగంగా ఇప్పటికే సుకుమార్, త్రివిక్రమ్ మరియు అనిల్ రావిపూడి వంటి డైరెక్టర్స్ తో సినిమాలు ఒప్పుకున్నాడు. అతి త్వరలోనే ‘భింబిసారా’ డైరెక్టర్ వసిష్ఠ తో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు త్వరలోనే ఆయన ప్రముఖ నిర్మాత అశ్విని దత్ తో ఒక సినిమా చేసేందుకు సంతకం చేసాడట. వైజయంతి మూవీస్ బ్యానర్ లో గతం లో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడో మన అందరికీ తెలిసిందే.
ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి క్లాసిక్స్ ఈ కాంబినేషన్ నుండే వచ్చాయి. ఇప్పుడు ఖారైనా ప్రాజెక్ట్ కి నాగ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడని టాక్. మహానటి సినిమా ద్వారా మంచి క్రేజ్ ని దక్కించుకున్న ఈ డైరెక్టర్, ప్రస్తుతం ప్రభాస్ తో ‘కల్కి’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ తో కూడా అలాంటి ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడట, వచ్చే ఏడాది లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.