Chinna : సిద్దార్థ్ ‘చిన్నా’ మూవీ రివ్యూ.. ఈ సినిమా మిస్ అయితే మీ జీవితం వేస్ట్!

- Advertisement -

నటీనటులు : సిద్దార్థ్, సహస్ర శ్రీ , నిమిషా సజయన్, అంజలి నాయర్ తదితరులు.
డైరెక్టర్ : AU అరుణ్ కుమార్
నిర్మాత : సిద్దార్థ్
సినిమాటోగ్రఫీ : బాలాజీ సుబ్రమణ్యం
సంగీతం : విశాల్ చంద్రశేఖర్ – దిబు నినన్ థామస్

ఒకప్పుడు యూత్ లో మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ రేంజ్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో సిద్దార్థ్. ఆయన పోషించిన పాత్రలు మన పక్కింటి కుర్రాడిని గుర్తు చేస్తాయి. అందుకే సిద్దార్థ్ అందరికీ అలా కనెక్ట్ అయ్యాడు. ఆయన నటించిన ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘ఓయ్’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే కొత్త రకం సినిమాలను మన తెలుగు ఆడియన్స్ అప్పట్లో పెద్దగా ఆదరించలేదనే బాధతో తెలుగు సినీ పరిశ్రమని వదిలి తమిళ్ కి షిఫ్ట్ అయ్యాడు. అక్కడ విభిన్నమైన సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కొత్త రకం సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తుండడం తో మళ్ళీ ఇక్కడికి రీ ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా ఆయన హీరో గా నటిస్తూ, నిర్మించిన ‘చిత్తా’ అనే సినిమా తమిళం , కన్నడ భాషల్లో విడుదలై మంచి సక్సెస్ ని అందుకుంది. ఈ చిత్రం రేపు తెలుగు లో ‘చిన్నా’ అనే పేరు తో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో ని కాసేపటి క్రితమే వేశారు. రెస్పాన్స్ ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాము.

కథ :

- Advertisement -

భర్త చనిపోయి ఏ తోడు నీడ లేకుండా ఉంటున్న వదిన (అంజలి నాయర్) కి అండగా నిలబడిన ఈశ్వర్ (సిద్దార్థ్) అనే కుర్రాడి కథ ఇది. వదిన, ఆమె కూతురుకి సంబంధించిన బాధ్యతలను తన భుజాన వేసుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఈశ్వర్. అన్నయ్య కూతురు ని తన సొంత కూతురిలాగా ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు ఈశ్వర్. ఇతనికి శక్తి (నిమిషా సజయన్) అనే అమ్మాయితో లవ్ ఎఫైర్ కూడా ఉంటుంది. ఇలా ఎంతో సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉంటాడు ఈశ్వర్. అలాంటి ఈశ్వర్ మీద 8 ఏళ్ళ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అనే నింద పడుతుంది. అసలు ఈశ్వర్ మీద ఇలాంటి నిండా వేసిన వారు ఎవరు?, ఎందుకు ఇలా చేసారు ?, ఈశ్వర్ తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు?, చివరికి అతను విజయం సాధించాడా లేదా అనేదే మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

చెయ్యని తప్పుకి బలైన ఒక అమాయకపు కుర్రాడిగా సిద్దార్థ్ ఈ చిత్రం లో నటించలేదు, జీవించాడు అని చెప్పొచ్చు. కొన్ని సన్నివేశాలను చూస్తుంటే సిద్దార్థ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని ఆశ్చర్యపోక తప్పదు. ముఖ్యంగా నింద తన మీద పడినప్పుడు తన అన్నయ్య కూతురుని హత్తుకోబోతుంటే,ఆ అమ్మాయి వెనక్కి నెట్టేస్తుంది. ఆ సమయం లో సిద్దార్థ్ నటన చూస్తే మనకి కమల్ హాసన్ గుర్తుకు వస్తాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో సన్నివేశాలు మన గుండెల్ని పిండేస్తుంది. ఇలాంటి కథ ని ఇంత అద్భుతంగా చెప్పేందుకు ఎంతో సృజనాత్మకత ఉండాలి. ఈ విషయం లో డైరెక్టర్ అరుణ్ కుమార్ ని ఎంత మెచ్చుకున్నా అది తక్కువ అవుతుంది. సిద్దార్థ్ తో పాటుగా మిగిలిన నటీనటుల నుండి కూడా అద్బుయమైన నటనని రాబట్టుకున్నాడు.

ఇక విశాల్ చంద్రశేఖర్ మరియు దిబు నినన్ థామస్ అందించిన సంగీతం సినిమా థీమ్ కి తగ్గట్టుగా ఆహ్లదకరంగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పట్ల కాస్త శ్రద్ద తీసుకొని ఉంది ఉంటే బాగుండేది అని అనిపించింది. బాలాజీ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ సహజత్వం ఉట్టిపడేలా ఉంటుంది. ఇక డైలాగ్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ప్రారంభ సన్నివేశం నుండి ఎండింగ్ వరకు ప్రతీ డైలాగ్ మనం థియేటర్స్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా గుర్తు ఉంటాయి, అంత అద్భుతంగా రాసాడు. కెమెరా ఫ్రేమింగ్స్, లైటింగ్స్ ఇలా అన్నీ విభాగాల్లో కూడా ఈ చిత్రం టాప్ క్లాస్ మేకింగ్ ని తలపిస్తాయి.

చివరి మాట :

చైల్డ్ అబ్యూజ్ మీద హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ అరుణ్ కుమార్ తీసిన ఈ చిత్రాన్ని కచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిందే. లేకపోతే ఒక అద్భుతమైన సినిమాని మిస్ అయిన భావన రేపు ఓటీటీ లో విడుదల అయ్యినప్పుడు మీకే అనిపిస్తాది. ఒక విధంగా చెప్పాలంటే కాన్సెప్ట్ పరం గా, నటన పరంగా సిద్దార్థ్ తన నుండి కెరీర్ బెస్ట్ ఇచ్చాడు. ఇది ఆయన పర్ఫెక్ట్ కం బ్యాక్ సినిమా అని అనుకోవచ్చు.

రేటింగ్ : 3.5 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here