Urfi Javed Engaged : సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ మరోసారి వార్తల్లోకెక్కింది. వింత వింత డ్రస్సులు వేసుకుని కెమెరాలకు ఫోజులిస్తూ నలుగురితో తిట్లుతినే ఉర్ఫీ ఇప్పుడు చేసిన పనితో మరోసారి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయింది. తను సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ప్రేక్షకులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఉర్ఫీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో ఆమె హోమగుండం వద్ద కూర్చుని ఉంది. పూజ జరుగుతోంది. ఆమెతో పాటు ఒక వ్యక్తి కూడా కనిపించాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరని తెలుసుకోనీయకుండా అతని ముఖం మాత్రం కనిపించకుండా మాస్క్ వేశారు.

ఉర్ఫీ పద్ధతిగా సల్వార్ సూట్లో కనిపించింది. ఆమె తలపై దుపట్టాను కూడా ధరించింది. చిత్రాలను చూస్తుంటే ఉర్ఫీ వ్యక్తిని తన వేలికి ఏదో ధరించేలా చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది పూర్తిగా స్పష్టంగా లేదు. ఇది చూసిన జనాలు సోషల్ మీడియాలో వీరి నిశ్చితార్థం గురించి ఊహాగానాలు ప్రారంభించారు. ఆమె ఫోటోలపై చాలా మంది కామెంట్స్ వస్తున్నాయి. వారిద్దరికీ విషెష్ చెబుతున్నారు. కొంతమంది ఉర్ఫీకి నిశ్చితార్థం కాలేదని, ఇది ఏదో షూటింగ్‌కి సంబంధించిన చిత్రం అని కూడా అంటున్నారు. ఈ చిత్రంలో నిజం ఏమిటో ఉర్ఫీ మాత్రమే చెప్పాలి. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 46 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.