Naga Chaitanya – Samantha : నాగార్జున ఇచ్చిన చెత్త సలహా వల్లే నాగ చైతన్య సమంత విడిపోయారట

- Advertisement -

Naga Chaitanya – Samantha : దాదాపు రెండు దశాబ్ధాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది సమంత. ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది. హీర నాగచైతన్యతో కలిసి సమంత నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడుకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. దీంతో బాగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది.

Naga Chaitanya - Samantha
Naga Chaitanya – Samantha

కేవలం నాగచైతన్యతో కలిసి ఏకంగా నాలుగు సినిమాల్లో నటించింది. ఇన్ని సినిమాల్లో నాగచైతన్యతో కలిసి నటిస్తున్న సమయంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. కొంతకాలం పాటు లవ్ లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ జంట పెద్దల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కొంతకాలం అన్యోన్యంగానే ఉన్నారు. వీళ్లను చూసిన వాళ్లంతా చూడముచ్చటగా ఉన్నారంటూ పొగిడేశారు. ఎందరికో ఆదర్శంగా కూడా నిలిచారు. కానీ ఆ అన్యోన్యత ఎక్కువ కాలం నిలువలేదు.

వీరిద్దరి తలెత్తిన మనస్పర్థల కారణంగా విడపోయారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని ఎవరి జీవితం వారు విడివిడిగా గడిపేస్తున్నారు. వారు విడిపోయి కొన్నేళ్లు అవుతున్నా ఇప్పటికీ వారి డివోర్స్ కు తగిన కారణం ఎంటా అని అభిమానులు ఆరా తీస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు రకాల కారణాలు చెబుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అలాంటి మరొక రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగార్జున ఇచ్చిన సలహా వల్లే వారి జీవితాలు ఇలా తయారయ్యానని ఆయను ఆడిపోసుకుంటున్నారు. ఇలాంటి సలహా ఇవ్వకపోయి ఉంటే సమంత నాగచైతన్య జీవితంలో ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
samantha

మరి నాగార్జున ఇచ్చిన సలహా ఏంటి అనే విషయానికి వస్తే.. పెళ్లయిన తర్వాత సమంత నాగచైతన్యను పిలిపించి వారిద్దరినీ కూర్చోబెట్టి ఓ విషయం చెప్పారట. ప్రస్తుతం మీరిద్దరూ కెరీర్ గురించి ఆలోచించండి. ఇండస్ట్రీలో సెట్ అయి, సెటిల్ అయిన తర్వాతే పిల్లల గురించి ఆలోచించండి. అప్పటి వరకు పిల్లల ప్యానింగ్ వద్దని చెప్పారట. దీంతో వీరిద్దరూ కెరీర్లో సెటిల్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తూ వరుసగా ఒకరినొకరు దగ్గర లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయారట.

ఇలా సమంత వరుస సినిమాల్లో నటిస్తుండడం.. నాగచైతన్యతో టైం స్పెండ్ చేయలేకపోవడంతోనే వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయట. దీంతో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారట. నాగార్జున ఇలాంటి సలహా ఇవ్వకపోయి ఉంటే వీరిద్దరికీ పిల్లలు పుట్టి సమంత వారి ఆలన పాలన చూసుకుంటూ ఇద్దరూ కలిసి జీవితాంతం అన్యోన్యంగా ఉండే వారని అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here