Chandramukhi 2 Review : ఇది సీక్వెల్ కాదు.. రీమేక్!

- Advertisement -

Chandramukhi 2 Review : అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు పీ వాసు కాంబినేషన్ వచ్చిన చంద్రముఖి చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ గా నిల్చిన ‘ఆప్తమిత్ర’ అనే చిత్రానికి ఇది రీమేక్. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘బాబా’సినిమా డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత చేసిన ప్రాజెక్ట్ ఇది. రజినీకాంత్ లాంటి స్టార్ ఇలాంటి హారర్ సినిమాలు చేస్తే జనాలు చూస్తారా అనే సందేహం ఉండేది.

కానీ డైరెక్టర్ రజినీకాంత్ ఇమేజికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తీసాడు. తమిళం తో పాటుగా తెలుగు లో కూడా సంచలన విజయం సాధించింది ఈ చిత్రం. ఈ సినిమా సీక్వెల్ గా అప్పట్లో వెంకటేష్ హీరో గా ‘నాగవల్లి’ అనే చిత్రం వచ్చింది. కానీ పెద్ద ఫ్లాప్ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2 ‘ పేరుతో మరో సీక్వెల్ చేసాడు, ఈ చిత్రం ఆడియన్స్ ని అలరించిందో లేదో ఒకసారి చూద్దాం.

Chandramukhi 2 Review
Chandramukhi 2 Review

కథ :

- Advertisement -

అతి పెద్ద ఉమ్మడి కుటుంబం గల మహిళా రంగనాయకి ( రాధికా శరత్ కుమార్). ఎంతో సంతోషంగా అన్యోయంగా తన గడుపుతున్న ఈ కుటుంబం లో అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. దీనికి పరిష్కార మార్గం కోసం స్వామిజి(రావు రమేష్) ని కలవగా, మీ కుల దైవం గుడిలో పూజలు చేయిస్తే ఈ ఇక్కట్లు తొలుగుతాయి అని అంటాడు. కుటుంబం మొత్తం కచ్చితంగా ఉండాలి అనే నియమం పెట్టడం తో వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, లేచిపోయి పెళ్లి చేసుకున్న కూతుర్ని పిలవాల్సి వస్తుంది. ఆమెతో పాటు మదన్ ( రాఘవ లారెన్స్) కూడా వస్తాడు.

కుల దైవం గుడికి దగ్గర్లో చంద్రముఖి ప్యాలస్ ఉంటుంది. చంద్ర ముఖి తన భార్య శరీరం ని వదిలి వెళ్లిపోయిన తర్వాత కైలాష్ ( మొదటి చంద్రముఖి ప్రభు) ఆ ప్యాలస్ ని వదిలి వెళ్ళిపోతాడు. ఆ ప్యాలస్ లోకి రంగనాయకి కుటుంబం వస్తుంది. ఆ ప్యాలస్ మొత్తానికి ఓనర్ గా ఉన్న బసవయ్య ( వడివేలు), రంగనాయకి కుటుంబం లో ప్రతీ ఒక్కరికి దక్షిణం వైపు వెళ్లోద్దని చెప్తాడు. కానీ వీళ్ళు వినకుండా దక్షిణం వైపే వెళ్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే కథ.

Lawrance

విశ్లేషణ :

‘చంద్రముఖి’ చిత్రం ఆరోజుల్లో అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కథలో కొత్తదనం ఉండడం వల్లే. అప్పటి వరకు ఆ తరహా హారర్ సినిమా తెలుగు లో కానీ , తమిళం లో కానీ రాలేదు. చూసిన ప్రతీ ప్రేక్షకుడు థియేటర్ లో వణికిపోయాడు, అందుకే అది క్లాసిక్ గా మిగిలింది. ఆ తర్వాత ఆ తరహా సినిమాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి, అందుకే చంద్రముఖి 2 చిత్రం మనకి చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఇక రాఘవ లారెన్స్ ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

జనాలు ఆయన్ని ఇలాంటి హారర్ సినిమాల్లో చూసి చూసి విసిగిపోయారు. అందువల్ల ఆడియన్స్ ని ఈ చిత్రం అనుకున్న స్థాయిలో భయపెట్టలేకపోయింది. ఈ కథలో కొత్తదనం ఏదైనా ఉందా అంటే వేటయ్య రాజు పాత్ర కి సంబంధించిన ఆత్మ తిరిగి రావడం. అతని ఆత్మ మరియు చంద్ర ముఖి ఆత్మ కి మధ్య జరిగే పోరాటం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది.

Kangana in Chandramukhi 2 Review

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో పేస్ లో ఉంటుంది, కానీ ఇంటర్వెల్ మాత్రం అదిరిపోతోంది. ఇంటర్వెల్ లో వచ్చిన ఊపుని సెకండ్ ప్రారంభం లో కొనసాగించలేకపోయాడు డైరెక్టర్ వాసు. చంద్రముఖి చిత్రం తరహా స్క్రీన్ ప్లే నే ఉంటుంది. అక్కడి పాత్రలు , ఇక్కడి పాత్రలు వేరే. ఇది చూసే ఆడియన్స్ కి సీక్వెల్ లాగ అనిపించదు, రీమేక్ లాగ అనిపిస్తుంది.

లారెన్స్ కి ఇలాంటి పాత్రలు చెయ్యడం కొత్తేమి కాదు కాబట్టి, అతని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక చంద్రముఖి పాత్ర పోషించిన కంగనా రనౌత్ ఉన్నది కాసేపే అయినా , సినిమాకి ఆయువు పట్టులాగా నిల్చింది. ఇక ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి అందించిన అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ కి చిరాకు కలిగించింది. ఒక్కటంటే ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు.

చివరిమాట :

చంద్రముఖి సినిమాని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి వెళ్తే మాత్రం నిరాశ చెందుతారు. ఎదో కాసేపు కాలక్షేపం చేద్దాం అని అనుకోని వెళ్లే ఆడియన్స్ కి ఈ చిత్రం నచుతుంది.

నటీనటులు : రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, లక్ష్మి మీనన్ తదితరులు
ఛాయాగ్రహణం : ఆర్డీ రాజశేఖర్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుబాస్కరన్
రచయిత, దర్శకుడు : పి.వాసు

రేటింగ్ : 2.5 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com