Skanda : ‘స్కంద’ మూవీ రివ్యూ..బోయపాటి పైత్యానికి పరాకాష్ట ఇది!

- Advertisement -

నటీనటులు :
రామ్ పోతినేని, శ్రీలీల, శ్రీకాంత్,సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్, గౌతమి, ఇంద్రజ, రాజా, శరత్ లోహితాశ్వ, పృథ్వీరాజ్ మరియు తదితరులు.

దర్శకత్వం, రచన : బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సంగీతం: ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే
ఎడిటర్: బిక్కిన తమ్మిరాజు

Skanda : అఖండ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను హీరో రామ్ తో ‘స్కంద’ అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమా ప్రకటించిన రోజు నుండి అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు మాములు రేంజ్ లేవు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ కి సరైన డైరెక్టర్ తగిలాడు, ఇక బాక్స్ ఆఫీస్ బద్దలు అనుకున్నారు. సెప్టెంబర్ 15 వ తారీఖున విడుదల చేస్తామని ముందుగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 28 కి వాయిదా పడింది. దీంతో ఈ చిత్రానికి ముందు ఉన్న బజ్ కాస్త తగ్గింది కానీ, ట్రైలర్ మాస్ ఆడియన్స్ కి నచ్చడం తో మళ్ళీ అంచనాలు పెరిగాయి. అలా నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అలరించిందో ఒకసారి చూద్దాం.

- Advertisement -
Skanda
Skanda

కథ :

దిగ్గజ వ్యాపారవేత్తగా పేరు పొందిన రుద్రగంటి రామకృష్ణ రాజు (శ్రీకాంత్) తన కంపెనీల ద్వారా ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించి వారి దృష్టిలో దేవుడిగా కొలవబడుతాడు. అలాంటి మంచి మనిషి మీద ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి (అజయ్ పుర్కర్) మరియు తెలంగాణ ముఖ్యమంత్రి (శరత్ లోహితస్వ) లేనిపోని అభియోగాలు వేసి జైలుపాలు చేస్తారు. అలా సాగిపోతుండగా ఒకసారి ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య కూడా వైరం మొదలు అవుతుంది. అప్పుడు వీళ్లిద్దరి మధ్యలోకి భాస్కర్ రాజు ( రామ్ పోతినేని) వస్తాడు. అక్కడి నుండి కథ మొత్తం మారిపోతుంది. భాస్కర్ రాజు కి ఈ ఇద్దరి ముఖ్యమంత్రులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?, అతని వల్ల భాస్కర్ రాజు ఏమి నష్టపోయాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

బోయపాటి సినిమాలకు వెళ్లాలంటే ముందుగా మన బుర్ర తీసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి పోవాలి. ఎందుకంటే ఆయన సినిమాల్లో లాజిక్స్, సెన్స్ తో కూడుకున్న సన్నివేశాలు వంటివి ఏమి ఉండవు. కేవలం సెన్స్ లేని మాస్ సన్నివేశాలు, యాక్షన్ బ్లాక్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఫిక్స్ అయ్యి వెళ్ళాలి, లేకపోతే ఏమి సినిమా తీసాడు రా బాబు అని తల పట్టుకుంటాం. ఈ సినిమా కూడా అలాంటిదే, ఆయన మార్కు మాస్ సన్నివేశాలకు కొదవే లేదు, అవి నాచే ఆడియన్స్ కి భుక్తాయాసం వస్తాది. ముఖ్యంగా హీరో రామ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పిస్తాయి. ఇక బోయ మార్క్ డైలాగ్స్ కేవలం బాలయ్య బాబు కి మాత్రమే సెట్ అవుతాయి, మిగతా హీరోలకు సెట్ అవ్వవు అని అనుకుంటూ ఉంటాం. కానీ డైలాగ్స్ కూడా ఈ చిత్రం లో రామ్ డైలాగ్ డిక్షన్ కి తగ్గట్టుగా , సూట్ అయ్యేటట్టు రాసాడు. ఆయన క్యారక్టర్ కూడా అదిరిపోయింది.

ఇక హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈమె తన అందం మరియు డ్యాన్స్ తో అదరగొట్టింది కానీ, నటన మాత్రం చాలా ఆర్టిఫీషియల్ గా అనిపించింది. కచ్చితంగా ఈమె నటన లో పరిణీతి పెంచుకోవాలి, లేకపోతే కష్టం అని అనిపిస్తాది. ఇక హీరో శ్రీకాంత్ ఇందులో సాఫ్ట్ రోల్ లో అదరగొట్టాడు. ‘అఖండ’ చిత్రం లో క్రూర మృగం లాగ ఎంత నెగటివ్ గా బోయపాటి శ్రీకాంత్ ని చూపించాడో, ఈ సినిమాలో అంత పాజిటివ్ గా చూపించాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధిమేర పర్వాలేదు అనిపించారు. ఇక ఈ చిత్రానికి మైనస్ ఏమైనా ఉందా అంటే అది థమన్ అనే అనిపించింది. ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా లౌడ్ గా, చెవుల్లో నుండి రక్తం కారే రేంజ్ లో ఉంది. పాటలు కూడా ఒకటి తప్ప మిగిలినవి పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి, ఇక బోయపాటి శ్రీను మాత్రం తన మార్కు ని చూపించాడు. ఎమోషన్స్ ట్రై చేసాడు కానీ , పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

చివరి మాట :

ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే రెగ్యులర్ బోయపాటి మాస్ సినిమాలకు అలవాటు పడిన ఆడియన్స్ కి తెగ నచ్చేస్తుంది ఈ చిత్రం. కథలో లాజిక్స్ , సెన్సిబుల్ సన్నివేశాలను ఆశించి అయితే ఈ చిత్రానికి వెళ్ళకండి.

రేటింగ్ : 2.5/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here