Samantha : సౌత్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సమంత. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఆ తర్వాత కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కోలీవుడ్ మరియు బాలీవుడ్ లలో కూడా ఈమెకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ప్రతీ స్టార్ హీరో కి తమ సినిమాలో ఈమెని హీరోయిన్ గా తీసుకునే వారు. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య తో పెళ్లి తర్వాత ఈమె జీవితమే మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి చేసుకున్న అమ్మాయి కనుక, రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కి దూరం అవుతూ, కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే పోషించేది. ఇక ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా అలాంటి రోల్స్ కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది సమంత.
ఇదంతా పక్కన పెడితే సమంత గురించి ప్రతీ రోజు సోషల్ మీడియా లో ఎదో ఒక వార్త తిరుగుతూనే ఉంటుంది. రీసెంట్ గా ఆమె గతం లో నాగ చైతన్య గురించి మాట్లాడిన కొన్ని మాటలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది. ఒక ఇంటర్వ్యూ లో హీరో దగ్గుపాటి రానా ‘నీకు కుక్కల్ని పెంచుకోవడం ఇష్టమా’ అని అడుగుతాడు. అప్పుడు సమంత ‘నాకు ఇష్టమే కానీ, మా ఆయనకీ ఇష్టం లేదు, అందుకే పెంచుకోవడం లేదు’ అని అంటుంది.
అంతే కాకుండా ‘మా ఆయనకీ నేను కుక్కలాగా అన్నమాట, ఆయన షూటింగ్ నుండి ఇంటికి రాగానే కుక్క పిల్లలాగా నేనే అతని దగ్గరకి వెళ్తాను, కాబట్టి ఆయన కుక్కల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు, నేనే అతని కుక్కని’ అంటూ ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు ఇద్దరు ఎంత అన్యోయంగా ఉంటారో అర్థం అయ్యింది, అలాంటి క్యూట్ కపుల్ ఎలా విడిపోయిందో ఇప్పటికి అర్థం కావడం లేదని అంటున్నారు ఫ్యాన్స్.