Nagarjuna : అక్కినేని నాగార్జున గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ అగ్రహీరోల్లో నాగార్జున ఒకరు. తెలుగు ఇండస్ట్రీ ఆయనను ముద్దుగా కింగ్ అని పిలుచుకుంటుంది. అలాంటి నాగార్జున ఒకప్పుడు ప్రేక్షకులకు చేసిన మోసం ఇటీవల బయటపడింది. నాగార్జున చేసిన మోసాన్ని ఒక్క వీడియో బయటపెట్టింది. ఆయన అభిమానులు నాగార్జున చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగార్జున తన కెరీర్లో చెప్పుకొదగిన చిత్రాల్లో ఒకటి మన్మథుడు. దర్శకుడుకె. విజయ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సోనాలి బింద్రే, అన్షు నాగ్ కు జోడీగా నటించారు. వీరితో పాటు చంద్రమోహన్, సునీల్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, సుధ లాంటి వారు కీలకపాత్రల్లో నటించారు. నాగ్ సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రాన్ని నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా 2002లో సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాగ్ కెరీర్‌తో కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రాలో మన్మథుడు కూడా ఒకటి. ఇటీవల కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా మన్మథుడు సినిమాను తన అభిమానుల కోసం రీరిలీజ్ కూడా చేశారు. అసలు మోసం ఇక్కడే ఉంది.. అయితే ఈ సినిమాలో నాగార్జున బ్రిడ్జ్ దాటే సీన్ చూసే ఉంటారు. నిజానికి సినిమాలో నాగార్జునకు నీళ్లంటే భయం. దీంతో సోనాలి తన కళ్లల్లోకి చూడమని చెప్పి నాగార్జునను బ్రిడ్జీ దాటిస్తుంది. అయితే ఈ సీన్ పారిస్‌లో చిత్రీకరించినట్లు మనకు చూపించారు. కానీ, ఆ బ్రిడ్జ్ పారిస్‌లోనే లేదు. అది ఆస్ట్రియా దేశంలో ఉంది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ మీమ్ రూపంలో ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. నాగార్జున ఎంత మోసం చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తు్న్నారు.