ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరి గుర్తు పట్టారా..?, ఈమె తొలుత యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించింది. పాపం ఈమె కుటుంబానికి ఈమె ఒక్కటే జీవనాధారం. ఈమె కష్టపడితే కానీ పూట గడవదు, కేవలం కుటుంబం కోసమే ఆమె పెళ్లి ఈడు వచ్చినా కూడా పెళ్లి చేసుకోలేదు. యూట్యూబ్ లో షర్ట్ ఫిల్మ్స్ ద్వారా సంపాదించిన పాపులారిటీ తో సీరియల్స్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటి వరకు ఈమె చేసిన సీరియల్స్ అన్నిట్లో విలన్ రోల్స్ చేస్తూ వచ్చింది.

ఎంతో అందం తో హీరోయిన్స్ ని సైతం డామినేట్ చెయ్యగల ఈమె , ఇలా విలన్ రోల్స్ చెయ్యడం ఏమిటి అని అందరూ అనుకునే వారు. ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ని సంపాదించింది. సినిమాల్లో కూడా ఇప్పుడు అవకాశాలు సంపాదిస్తుంది. అన్నిటికి మించి ఈమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో టాప్ 6 కంటెస్టెంట్, ఆమె మరెవరో కాదు శ్రీ సత్య.

ఈమె బిగ్ బాస్ ద్వారా ఎంత మంచి పాపులారిటీ ని సంపాదించుకుందో మన అందరికీ తెలిసిందే. అందం తో కుర్రకారుల మనసుల్ని కొల్లగొట్టడమే కాకుండా, టాస్కులు కూడా మగవాళ్ళతో సమానంగా ఆడి టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చింది. హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఈమె బీబీ జోడి డ్యాన్స్ ప్రోగ్రాం లో పాల్గొన్నది. ఈమె డ్యాన్స్ టాలెంట్ ని చూసి ప్రతీ ఒక్కరు నోరెళ్లబెట్టారు. ఎంతో కష్టమైన, ప్రమాదకరమైన స్టెప్పులను కూడా అవలీలగా వేసేసింది.

ప్రస్తుతం ఆమె ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇక యూట్యూబ్ లో ఆమె చేసిన వెబ్ సిరీస్లలో ‘తొందరపడకు సుందరవదన’ పెద్ద హిట్ అయ్యింది. రెండు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్, త్వరలోనే మూడవ సీజన్ ని ప్రారంభించుకోబోతుంది. ఈ సీజన్ లో హీరోయిన్ గా నటించడానికి సంతకం చేసింది శ్రీ సత్య. వీటితో పాటు ఒక క్రేజీ సినిమాలో నటించడానికి కూడా ఒప్పుకుందట.
