తెలుగు చిత్ర పరిశ్రమలో తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సినిమాల్లో పాటలు పాడి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హీరోయిన్లకు సరిసమానమైన అందంతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటుంది. అంత స్టార్ సింగర్ అయిన గీతా మాధురికి కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తప్ప లేదట. ప్రస్తుతం అదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గీతామాధురి.. ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాలోని పాట ద్వారా పరిచయమైంది. తన కెరీర్ మొదట్లో ఓ బడా నిర్మాత అగ్ర హీరోల సినిమాల్లో పాటలు పాడాలంటే తన బెడ్ రూమ్ కు రావాలని పిలిచాడట. కానీ గీత మాధురికి ఆ విషయం అర్థమైందట. అవసరమైతే పాటలు పాడడం అయినా మానేస్తాను కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయనని ఆ డైరెక్టర్ మొఖం మీదే చెప్పేసిందట. ఈ విషయంలో ఎంత నిజం ముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత సినిమాలో గీత మాధురి పాడిన చమ్కా చమ్కా చమ్కారే.. అనే సాంగ్ అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. దీంతో ఆమెకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. చాలా సినిమాల్లో గీత మాధురికి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ వచ్చినా చేయలేదు. నటుడు నందును పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.