ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఏడో సీజన్ ఫుల్ జోష్ లో కొనసాగుతుంది. బుల్లితెరపై టాప్ టీఆర్పీలతో షో దూసుకుపోతుంది. ఇటీవల మొదటి వారం విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో వారంలోకి ప్రవేశించింది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. మొదటి నుంచే హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ షో మొత్తం ఉల్టా పల్టా అని చెప్పుకొస్తున్నారు. దానికి తగ్గట్లే షో స్టార్టింగ్ నుంచి ఏదో ఒక వెరెటీ కనిపిస్తూనే ఉంది. ఇక రెండో వారం ప్రారంభం నుంచే షో మరింత ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది.
ఇది ఇలా ఉంటే.. ఎప్పుడు బిగ్ బాస్ వాయిస్ వినపడుతుంది.. కానీ ఆ మనిషి ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా బిగ్ బాస్ సక్సెస్ కావడంలో ఆ వాయిస్ కూడా ప్రధాన పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. అన్ని సీజన్లకు కూడా ఇదే వాయిస్. అలాంటి గంభీరమైన వాయిస్ ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ది. ఆయన ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో కూడా విన్నాం. ఇంతకీ బిగ్ బాస్ కు వాయిస్ ఓవర్ చేస్తున్న వ్యక్తి మరెవరో కాదు. రాధాకృష్ణ అలియాస్ రేనుకుంట్ల శంకర్. ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్స్ లో చాలా ఫేమస్. 15ఏళ్ల క్రితమే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. పలు సీరియల్స్, సినిమాలు, అడ్వర్టైజ్‌మెంట్స్ కు కూడా వాయిస్ ఓవర్ అందజేశారు. తెలుగులో బిగ్ బాస్ షో 2017లో ప్రారంభమైనప్పుడు వాయిస్ ఓవర్ కోసం నిర్వాహణ బృందం సుమారు 100 డబ్బింగ్ ఆర్టిస్ట్ లను పరీక్షించారట. వారందరిలో నిర్వాహకులకు శంకర్ గొంతు నచ్చింది. దీంతో అతడినే ఫైనల్ చేశారు. షో నిర్వాహకులు ఏం మాట్లాడాలో రాస్తే దానిని అతడు చదువుతాడు. హౌస్ మేట్స్ ను తన గంభీరమైన వాయిస్ తో హౌసులో కంట్రోల్ చేస్తాడు.