Shocking: ఏంటి పై హెడ్డింగ్ చూడగానే కళ్లు బైర్లు కమ్ముతున్నాయా. అవును నిజం తమన్నా నిజంగానే తల్లి కాబోతుంది. కాకపోతే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ఇప్పటి వరకు తెరపై తన సెక్సీ ఫిగర్ తో కుర్రాళ్ళ కలల రాణిగా వెలుగొందుతుంది తమన్నా. తనను ఇప్పటి వరకు ఓ లవర్ క్యారెక్టర్లోనే ప్రతి ఒక్కరూ ఊహించుకున్నారు. కానీ ప్రస్తుతం తమన్నా మొదటి సారి తన రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేసేసింది. బాలీవుడ్ సినిమాలో ఏకంగా ఓ హీరోయిన్ కి తల్లిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను ఆరాధించే ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్నారు. తమన్నాను తల్లిగా చూడలేమంటూ ఫీల్ అవుతున్నారు.

దాదాపు నాలుగు పదుల వయసు వచ్చినా తమన్నా ఇంకా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది. తన అందచందాలతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటి వరకు తను కేవలం ఎక్స్ పోజింగ్ మాత్రమే చేసింది. లస్ట్ స్టోరీస్ 2లో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి పండించిన రొమాన్స్ కు కుర్రాళ్లు హీటెక్కిపోయారు. ప్రస్తుతం తల్లి క్యారెక్టర్లో నటిస్తానని తమన్నా తీసుకున్న నిర్ణయానికి ఆ సినిమా డైరెక్టర్ కారణమని తెలుస్తోంది. మొదటి నుంచి ఆ దర్శకుడి డైరెక్షన్ లో నటించాలని అనుకున్న తమన్నా ఆయన సూచన మేరకే ఈ పాత్రలో కనిపించబోతుందట. అయితే ఆ సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ తల్లి పాత్రలో తమన్నా కనిపించబోతుందట. దీంతో నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ పాత్రలు చేసిన మిల్కీ బ్యూటీ ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కి తల్లిగా కనిపించబోతుందా ..? అంటూ తన అభిమానులు షాక్ అయిపోతున్నారు. నిజానికి తమన్నాను కలలో కూడా తల్లి పాత్ర చేస్తుందని అభిమానులు అనుకోలేదు. చూడాలి మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో..?
