బిగ్ బాస్ తెలుసు సీజన్ 7లో రెండోవారం నామినేషన్స్‌కు సెకండ్ పార్ట్ ప్రసారమయ్యింది. ఇక ఫస్ట్ పార్ట్‌లో పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ ఎంత రసవత్తరంగా సాగాయో.. సెకండ్ పార్ట్‌లో కూడా అదే కొనసాగింది. ఈ ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్ తో పాటు శోభా శెట్టి నామినేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. ముందుగా తనను నామినేట్ చేయడానికి వచ్చిన హౌస్ మేట్ శివాజీతో శోభా శెట్టి మాటల యుద్ధం చేసింది. ఒకరు చెప్పిన కారణాలు మరొకరు ఒప్పుకోకుండా వాదిస్తూ హౌస్ వాతావరణాన్ని హీటెక్కించారు. నువ్వు నామినేట్ చేశావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానంటూ శివాజీ.. శోభా శెట్టిని నామినేట్ చేశాడు. ‘వేరేవాళ్ల కారణాలు నీ కారణాలు అని చెప్తున్నావు. ప్రియాంక గురించి మాట్లాడుతున్నావు’ అంటూ కామెంట్ చేయగా.. శోభా శెట్టి.. శివాజీ మాటలను ఒప్పుకోలేదు. ‘నా కారణం అదే’ అంటూ శోభాను నామినేట్ చేసి వెళ్లిపోయాడు. కానీ నామినేషన్ అయిపోయి బయటికి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య వార్ స్టార్ట్ అయింది. ఏ కారణం లేకుండా నన్ను నామినేట్ చేశారంటూ శోభా శెట్టి శివాజీని విమర్శించింది.

నిన్ను నామినేట్ చేయడానికి కారణం లేకపోవడం ఏంటంటూ శివాజీ సీరియస్ అయ్యాడు. ‘కలిసికట్టుగా ఆడుతున్నావు’ అంటూ విమర్శించాడు. ఆ మాటను శోభా శెట్టి ససేమీరా ఒప్పుకోలేదు. నేను వాదించడం మొదలుపెడితే తట్టుకోలేవు. వదిలేయ్ అన్నాడు. నాకు కూడా మాటలు వచ్చని శోభా అనగా అన్ని అంటే తట్టుకోలేవంటూ శివాజీ కౌంటర్ ఇచ్చాడు. నువ్వు అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండకని శోభాతో చెప్పాడు. బయట ఉన్నట్టు ఇక్కడ ఉండొద్దు మీరు. బయట అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకోవద్దంటూ వ్యంగ్యంగా శివాజీకి శోభా సమాధానం ఇచ్చింది. శివాజీ.. తన మాటలు పట్టించుకోకుండా పో అన్నాడు. మీరు కూడా పోండని చెప్పింది. ఈ కంటెంట్ ఇక్కడ వర్కవుట్ అవ్వదన్నాడు. కొత్త కంటెంట్ ట్రై చేయ్ అన్నాడు. నోరు తెరిస్తే కంటెంట్, కంటెంట్ అంటారని అరవడం మొదలుపెట్టింది శోభా శెట్టి. చివరిగా కంటెంట్ అనే మైండ్‌సెట్ మార్చుకుంటే బాగుంటుంది అంటూ చివరిగా శివాజీతో చెప్పి తప్పుకుంది శోభా శెట్టి.
