రెచ్చిపోయిన బుల్లెట్ బాస్కర్.. ఏకంగా మెగాస్టార్ సినిమాపైనే పంచ్ లు..

- Advertisement -

ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో ప్రతి శుక్రవారం ప్రేక్షకుల్ని అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతివారం సరికొత్త స్కిట్లతో ఆడియన్స్ ని తమ పంచులతో నవ్విస్తున్నారు కమెడియన్స్. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15న ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.

లేటెస్ట్ ప్రోమోను పరిశీలిస్తే.. భాస్కర్ స్కిట్ ని చూపించారు. ‘‘చిరంజీవి సినిమాలో నువ్వు చేసావు’’ అని రష్మితో చెబుతూ.. “నీకోసం సినిమా థియేటర్‌కు వెళ్తే ఇంటర్వెల్ వరకు కనబడలేదు. సరే ఇంటర్వెల్ తర్వాత వస్తావు కదా అని థియేటర్లో వెయిట్ చేస్తే కింద కర్చీప్ పడింది. ఇలా తీసేలోపే మళ్ళీ వెళ్ళిపోయావు” అంటూ రష్మీని ఆటపట్టించడంతో షోలో ఉన్న వాళ్లంతా నవ్వారు.

“ఊరు వెళ్తే పిల్లలు ఎప్పుడూ పిల్లలు ఎప్పుడూ? అని అడుగుతున్నారు” అని భాస్కర్ భార్య అడగగా, “బేబీ ఒకటి గుర్తుపెట్టుకో, అరవని కుక్క ఉండదు. విమర్శించని నోరు ఉండదు. ఇవి రెండూ లేని ఊరే ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి” అని జైలర్ ఆడియో లాంచ్ లో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయగా మధ్యలో కుష్బూ, డైలాగ్ తమిళంలో తప్పు చెప్పావని భాస్కర్ తో అంటుంది. దీంతో భాస్కర్ తెల్లముఖం వేస్తాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here