కొత్త సిల్క్ స్మితను పట్టుకొచ్చిన విశాల్.. ప్రస్తుతం ఉన్న ఐటెమ్ గర్ల్స్ పని అయిపోయినట్లేనా..

- Advertisement -

తమిళ హీరో విశాల్ నటిస్తున్న కొత్త మూవీ ‘మార్క్ ఆంటోని’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ, అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

స్మిత
స్మిత

అయితే ఆ ట్రైలర్ లోని ఒక విషయం అందర్నీ ప్రత్యేకంగా ఆకర్షించింది. ట్రైలర్ లో అలనాటి నటి ‘సిల్క్ స్మిత’ కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు సిల్క్ స్మితని మూవీలో ఎలా చూపించారు అని అందరూ తెగ అరా తీసేస్తున్నారు. ఇంతకీ మూవీలో సిల్క్ ని చూపించడానికి ఏమన్నా టెక్నాలజీ ఉపయోగించారా..? లేదా ఇంకేమన్నా టెక్నిక్స్ యూజ్ చేశారా..? అసలు విషయం ఏంటంటే.. మూవీలో సిల్క్ స్మితని చూపించడానికి ఎటువంటి టెక్నాలజీ వాడలేదు. సిల్క్ పోలికలతో ఉన్న ఒక అమ్మాయిని తీసుకు వచ్చి ఆ పాత్రని చేయించారు. ‘గాంధీ విష్ణు ప్రియ’ అనే ఒక అమ్మాయి చూడడానికి సిల్క్ లాగానే కనిపిస్తుంది. ఆమె తన సోషల్ మీడియాలో సిల్క్ స్మితలా కనిపించే వీడియోలు చేసి షేర్ చేస్తూ వచ్చేది.

అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య పలు యూట్యూబ్ ఛానల్స్ కి కూడా ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఈ వీడియోలు మార్క్ ఆంటోని దర్శకుడు కూడా చూశాడు అనుకుంటా. ఇక మూవీలో గాంధీ విష్ణు ప్రియని సిల్క్ లా చూపించేందుకు.. ఆమెలా మేకప్ వేశారు. ఫలితంగా స్క్రీన్ పై అచ్చం సిల్క్ స్మితని చూసిన ఫీలింగ్ ని అభిమానులకు ఇస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here