Anchor Anitha : బాలకృష్ణ వల్లే నేను బతికి ఉన్నాను.. ప్రముఖ నటి కామెంట్స్

- Advertisement -


Anchor Anitha : బాలయ్య బాబు మంచి మనసు గురించి చాలా మంది ఎన్నో సందర్భాల్లో చెబుతూనే ఉంటారు. బయటికి కరుకుగా కనిపించినా ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. తాను ఒకరిని అభిమానిస్తే వారిని చాలా ప్రేమగా చూసుకుంటాడని చెబుతూ ఉంటారు. ఒకప్పటి మాజీ యాంకర్ అనిత కూడా బాలయ్య గురించి ఇటీవల ఇదే విషయంపై స్పందించింది. ఒకప్పుడు సుమ, ఝాన్సీ, శిల్ప, ఉదయభాను లాంటి టాప్ యాంకర్స్ తో బుల్లితెరపై యాంకర్ గా పోటీపడింది.

Anchor Anitha
Anchor Anitha

అనిత త‌న జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మొదటిసారి నేను అమెరికా వెళుతున్నప్పుడు ఓ పెద్ద రోడ్డుప్రమాదం జరిగింది. కస్తూరి సీరియల్ షూటింగ్ సమయంలో నా యాక్టింగ్‎కు మెచ్చి సన్మానం చేసేందుకు ఆహ్వానించారు. అప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ట్రక్ మా కారుని ఢీకొట్టింది. ఆ యాక్సిడెంట్లో నా కాలర్ బోన్ విరిగిపోయింది. దాంతో చాలా ఇబ్బంది పడి.. ఎలాగో కోలుకున్నాను.. మళ్లీ కేరింత మూవీ టైంలో మరో మేజర్ యాక్సిడెంట్ జరిగింది.

Anchor Anitha Photos

అప్పుడు నా డిస్క్ విరిగిపోయింది. ఆ టైంలో ఇక్కడ ఉండకుండా అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకోవాలని భావించాను. కానీ బాలయ్య బాబు నాకు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించారు’ అని అనిత చెప్పుకొచ్చింది. స్వయంగా ఆసుపత్రికి వచ్చి తమ డాక్టర్ తో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించారని నా అభిమాని బాలయ్య బాబుకు నా పరిస్థితి గురించి చెప్పారని.. దీంతో స్పందించిన ఆయన మా ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పి ట్రీట్ మెంట్ చేయించారు. నిజంగా సాయం చేయాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు.. కానీ ఆయన నా పట్ల చాలా కేర్ తీసుకున్నాడు అంటు చెప్పుకొచ్చింది అనిత. నాకు యాక్సిడెంట్ టైంలో డైరెక్టర్ కృష్ణవంశీ కూడా నాకు ధైర్యం చెప్పారు.

- Advertisement -

నా పక్కనే నిలిచారు అంటూ క్రియేటివ్ డైరెక్టర్ ను ప్రశంసలతో ముంచెత్తింది. కొన్ని కారణాల వల్ల తాను సినిమాల్లో కీలకపాత్రలను వదులు కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. బొమ్మరిల్లు సినిమాలో శ్రావణి క్యారెక్టర్ తనకే వచ్చిందని.. అలాగే కార్తికేయ 2 లో కూడా ఒక మంచి క్యారెక్టర్ వదులు కోవాల్సి వచ్చిందని బాధపడింది. అనిత చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here