పెద్ద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా అని ట్రైలర్ ద్వారా కొంత క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ క్రమంలో సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ తాను సెన్సిబుల్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ నుంచి ఇలా మాస్ జానర్ కి మళ్లడం వెనుక ఒక కారణం ఉందని అన్నారు. ఎలాంటి సబ్జెక్ట్ అయినా డీల్ చేయాల్సిన బాధ్యత ప్రతి డైరెక్టర్ కి ఉండాలి, అది ఒక క్వాలిటీ లా ఉండాలి.
నేను ఐఐటీలో పీహెచ్డీ చేస్తున్నప్పుడు అప్పటి మైండ్ సెట్ ప్రకారం మంచి చెప్పాలని అనుకున్నా. నా ఫ్రెండ్ చదువుతున్న బుక్ లో చూసి అలా అనుకున్నా. ఇక ఇప్పుడు ఇది యాక్షన్ జానర్ అని అన్నారు. ఇక మీడియా ప్రతినిధి ఒకరు ఈ సినిమాకి సామాన్యుడి సంతకం అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా తాను ఒక సామాన్యుడిని అని ముందుకు వెళ్తున్నారు. ఆయన క్యారెక్టర్ ను ఇందులో ఏమైనా చూపించారా అంటే ఎవరైనా సామాన్యులే అని ఆస్తిపాస్తులు, కుల మాటలకూ అతీతంగా అందరూ సామాన్యులే అని శ్రీకాంత్ అడ్డాల అన్నారు.
ప్రతి ఒక్కరూ అన్ని ఎమోషన్స్ ఉన్న కామన్ మ్యాన్. అందరిలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అందరూ చాలా ఉన్నతంగా ఉత్తమంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మనలో జలసీలు ఉంటాయి, కోపాలు,తాపాలు ఉంటాయి. మరోపక్క అంతా మంచే జరగాలనే ప్రయత్నాలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా కాదు మొత్తం సామాన్యులు అందరినీ దృష్టిలో పెట్టుకుని చేసిందని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు.