Gosspis : ఆ స్టార్ హీరోయిన్ ని స్విమ్మింగ్ పూల్ లో తోసి చంపేయాలని చూసిన ప్రముఖ నిర్మాత.. చివరికి ఏమైందంటే!

- Advertisement -

Gosspis : ఏ ఇండస్ట్రీ లో అయినా ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. తొక్కేయడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వాటిని అధిగమించి కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అధిగమించలేని వారు ఆ కుట్రలకు బలై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సరిగ్గా అలాంటి సంఘటనే బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ విషయం లో జరిగింది.

యవ్వనం లో ఆమె ఎంతో అందం గా ఉండేది. చాలా చలాకీగా కూడా ఉండేది, ఆమెకి అందం తో పాటుగా నటన,డ్యాన్స్ కూడా వచ్చు. నిర్మాతలు అప్పట్లో ఈమె డేట్స్ కోసం క్యూలు కట్టేవారు. ఆమె డేట్స్ దొరక్కపోతే వేరే హీరోయిన్స్ కి ఛాన్స్ దక్కేది. అలా ఉండేది ఆమె రేంజ్. ఆమె అందాలను చూసి ఒక నిర్మాత ఆమె పై మోజు పడ్డాడు. అతనికి అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Gosspis
Gosspis

పాపం ఇవేమి ఆ హీరోయిన్ కి తెలియదు, అప్పటికి ఆమె వయస్సు కేవలం 18 ఏళ్ళు మాత్రమే, మంచి ఏమిటి, చెడు ఏమిటి అనేది తెలియని వయస్సు అది. ఈ నిర్మాత కాస్త ప్రేమ చూపించి అడిగిన ప్రతీ ఒక్కటి కొని తెస్తుండేలోపు అతని మాయలో పడిపోయి సర్వస్వం సమర్పించుకుంది. అయితే ఒకానొక రోజున ఆమె తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆ నిర్మాతని కోరింది, కానీ అతను ఒప్పుకోలేదు.

- Advertisement -

ఎంత బ్రతిమిలాడినా కనికరించలేదు, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని తెలుసుకునేందుకు ఆమె విచారణ చేపట్టగా, అతనికి అప్పటికే పెళ్లి అయ్యి, పిల్లలు కూడా ఉన్నారు అనే విషయం తెలిసింది. ఇది తెలుసుకున్న ఆ కుర్ర హీరోయిన్ ఆవేశం తో రగిలిపోయింది. నీ బండారం మొత్తం మీడియా ముందు పెడతాను అని బెదిరించింది. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న సమయం లో ఆ నిర్మాత ఆ హీరోయిన్ ని స్విమ్మింగ్ పూల్ లో ముంచి చంపేయాలని అనుకున్నాడు. కానీ అదృష్టం కొద్దీ ఆమె బ్రతికింది, ఆ తర్వాత అతని పై పోలీస్ కేసు నమోదు చేసింది, ఆరేళ్ళు జైలు శిక్ష అనుభవించాడు. ఈ విషయం అప్పట్లో పెను దుమారమే రేపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here